కాల్ సెంట‌ర్‌కు ఫోన్ చేసి నవ్వులు పూయించారు: కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌లో చ‌మ‌త్కార శైలికి ఇదో నిద‌ర్శ‌నం. తెలంగాణ సంచార పశువైద్యశాలలు ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ 1962 నంబర్‌కు ఫోన్ చేసి సంచార పశువైద్య సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సన్నివేశం నవ్వులు పూయించింది. రైతులకు టోల్‌ఫ్రీ నెంబర్ బాగా పనిచేస్తోందా? అందుబాటులో ఉందా? అని సీఎం అధికారులను ప్రశ్నించారు. వెంటనే అధికారులు ఆ నెంబరుకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి చేతికి అందించారు. ఎంత సేపట్లో మా వద్దకు రాగలుగుతారని సీఎం ప్రశ్నించారు. ‘మీ పశువుకు ఏమైందో చెప్పగలుగుతారా? సార్ …’ అంటూ కాల్‌సెంటర్ వారు అడగడంతో సీఎం మాట్లాడుతూ ఇక్కడ పశువు లేదమ్మా…నేను సీఎంను ఇది ప్రారంభోత్సవ కార్యక్రమం అని సమయస్ఫూర్తితో మాట్లాడి సభలో నవ్వులు పూయించారు.

సీఎం కేసీఆర్‌కు, కాల్ సెంటర్ వారి మధ్య సంభాషణ
కాల్ సెంటర్: నమస్తే.పశు ఆరోగ్య సేవ 1962కు మేము ఏ విధంగా సహాయపడగలం సార్…చెప్పండి సార్…
సీఎం కేసీఆర్: మీరు ఏ స్టేషన్ నుండి మాట్లాడుతున్నారమ్మా..?
కాల్ సెంటర్: చెప్పండి సార్
సీఎం కెసిఆర్: అమ్మా మీరు ఎక్కడ ఉన్నారు? ఎంత సేపట్లో రాగలుగుతారు?
కాల్ సెంటర్: 30 నిమిషాల్లో రాగలుగుతాం…మీ పశువుకు ఏమైందో చెప్పగలుగుతారా? సార్
సీఎం కేసీఆర్: ఇక్కడ పశువు లేదమ్మా ..ఇది ప్రారంభోత్సవం…
కాల్ సెంటర్: ధన్యవాదాలు సార్..1962 నెంబర్‌కు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్..
సీఎం కేసీఆర్: కంగ్రాట్యులేషన్స్ గోహెడ్.. అంటూ సీఎం ఫోన్ పెట్టేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *