రాంచ‌ర‌ణ్‌ను బ‌లి చేస్తోందెవ‌రు..!

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌కు గ‌త రెండేళ్లుగా ఏదీ క‌లిసి రావ‌డం లేదు. చెర్రీ వ‌రుస క‌ష్టాల్లో ప‌డుతున్నాడు. ఓ వైపు గోవిందుడు – బ్రూస్‌లీ సినిమాల డిజాస్ట‌ర్ల‌తో కేరీర్ ప‌రంగా యువ హీరోల‌తో పోల్చుకుంటే వెన‌క‌ప‌డిపోయిన చెర్రీ త‌న నెక్ట్స్ సినిమా విష‌యంలో తీవ్ర క‌ష్టాలు ఎదుర్కొంటున్నాడు. కోలీవుడ్ హిట్ మూవీ త‌నీ ఒరువ‌న్ రీమేక్ తెలుగు వెర్ష‌న్ ధృవ సినిమాలో న‌టిస్తోన్న చెర్రీ ఈ సినిమాను ముందుగా ద‌స‌రాకు ఆ త‌ర్వాత దీపావ‌ళికి రిలీజ్ చేయాల‌నుకున్నాడు.

చివ‌ర‌కు ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేద్దామ‌ని ప్లాన్లు వేశారు. డిసెంబ‌ర్‌లో సోలోగా రిలీజ్ చేసి భారీ రికార్డుల‌ను కొల్ల‌గొట్టాల‌ని చెర్రీ ప్లాన్లో ఉన్నాడు. అయితే ఇంత‌లోనే దెబ్బ‌మీద దెబ్బ అన్న‌ట్టు ధృవ‌కు మ‌రో పెద్ద దెబ్బ త‌గిలింది. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఇండ‌స్ట్రీపై ఆ ఎఫెక్ట్ బాగా ప‌డింది. ఈ క్ర‌మంలోనే పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత వ‌స్తోన్న తొలి సినిమా ధృవే కావ‌డం విశేషం.

ఈ సినిమా ఎంత హిట్ అయినా వ‌సూళ్లు కుర‌వ‌డం క‌ష్ట‌మే అన్న టాక్ వ‌స్తోంది. దీంతో చెర్రీ ఆశించిన‌ట్టు ధృవ ఎంత హిట్ అయినా రికార్డులు కొల్ల‌గొట్టి ఇండ‌స్ట్రీ హిట్ అవ్వ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది. ఇక ఈ ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాల మీద కూడా ఉండ‌నుంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న బాల‌య్య శాత‌క‌ర్ణితో పాటు చిరు 150 వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150పై కూడా ఈ ప్ర‌భావం ఉంటుంది.

ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాకు నిర్మాత చెర్రీయే కావ‌డంతో చెర్రీకి ఇప్పుడు ఈ నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంతో అటు ధృవ‌, ఇటు ఖైదీ సినిమాల‌కు పెద్ద దెబ్బ ప‌డ‌నుంది. సో ఇలా అన్ని కార‌ణాలు క‌లిపి చెర్రీకి ఇప్పుడు పెద్ద దెబ్బేస్తున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *