బిగ్‌బాస్‌ బరిలో ఆ నలుగురు?? తెలుగు బిగ్‌బాస్ పై తెలియని ఉత్కంఠ

బిగ్‌బాస్‌ ఇప్పటివరకూ తెలుగు చానెల్స్ లో ఉన్న రియాలిటీషో ల రూపాన్ని పూర్తిగా మార్చేసిన షో. హాలీవుడ్ లో మొదలై సంచలనాలను నమోదు చేసిన ఈ సెలబ్రిటీ గేమ్ ఇండియాలో బాలీవుడ్ కీ అక్కడినుంచి తమిళ్ తెలుగు లకూ వచ్చింది. అయితే ఇక్కడ ఇలాంటి షో వర్క్ ఔట్ అవుతుందా? అన్న అనుమానాలతో పాటుగా, బ్లమైన వ్యతిరేకత కూడా వచ్చింది. పూర్తి నెగెటివ్ ఇంప్రెషన్ తో మొదలైన ఈ కాంట్రవర్షియల్ గేమ్ తర్వాత తర్వాత చాలామందిని తనవైపుకు తీప్పుకుంది.

సెలబ్రిటీలలో మనం మాలుగా చూడలేని రకరకాల కోణాలనీ, మనుషుల్లో ఉండే విపరీతమైన ఎమోషన్స్ నీ చూపించటమే కాదు ఎన్టీఆర్‌ లాంటి ఒక హీరోలో ఉన్న ఈజ్ నీ, ఒక విభిన్నమైన మనస్తత్వాన్ని కూడా ఈ షో బయటపెట్టింది. హౌస్మేట్స్ తో జూనియర్ మాట్లాడిన తీరూ, ప్రేక్షకులని ఆకట్టుకునేలా షోని హోస్ట్ చేసిన విధానం ప్రేక్షకులకి ఒక కొత్త ఎన్టీఆర్‌ ని చూపించింది.

సరే ఇవన్నీ పక్కన పెడితే… ఇప్పుడు ఈ షో చివరి దశకు వచ్చేసింది.. ఒక్కొక్కరూ వెళ్ళిపోగా చివరకు మిగిలిన ఆ నలుగురిలో ఎవరు ఇప్పుడు “బిగ్ బాస్” టైటిల్ ని గెల్చుకుంటారు? అన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలుస్తోంది…. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఆరుగురు సభ్యులు మిగిలారు. 1. నవదీప్‌ 2. శివబాలాజీ 3. అర్చన 4. హరితేజా 5. ఆదర్శ్‌ 6. దీక్షా.

ఈ వారం నామినేట్‌ అయిన వారిలో అర్చన, హరితేజా, ఆదర్శ్, దీక్షా ఉన్నారు. వీరిలో ఇద్దరు- ఆదర్శ్, దీక్షాను పంపించేయవచ్చని… ఆఖరు వారానికి నవదీప్, శివబాలాజీ, అర్చన,హరితేజా మిగులుతారని ఎక్కువమంది భావిస్తున్నారు. అయితే ఎవర్ని పంపిస్తారన్న విషయం ఖచ్చితంగా చెప్పలేం… అయితే ఈ ఆరుగురిలోనే ఫైనల్స్ కి నలుగురు వెళ్తారు. మరి ఫైనల్కి వెళ్తే బిగ్ బాస్ తైటిల్ ఎవరు గెలుచుకోవచ్చు అన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న…

బిగ్‌బాస్‌ మొదలైనప్పటి నుంచి ఆ షో ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంది. చివరి వరకూ ఉంటారనుకున్న ధన్‌రాజ్, ప్రిన్స్‌ షో నుంచి ఎలిమినేట్‌ కావాడం వాళ్ల అభిమానులకే కాదు చాలామంది ప్రేక్షకులకు మింగుడు పడటం లేదు. హౌస్‌లో ఎక్కువసార్లు నామినేట్‌ అయిన అర్చన, దీక్షా, శివబాలాజీ వంటి వారు షోలో మిగిలి తక్కువసార్లు నామినేట్‌ అయిన ప్రిన్స్, ధన్‌రాజ్‌ బయటకు వచ్చేయడం ఊహించని మలుపుగా భావించవచ్చు.

అర్చన అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళలో అర్చన విషయానికి వస్తే ఈమె టైటిల్ గెలిచే అవకాశం ఉందన్నది మాత్రం చాలామందికి అనుమానమే… హీరోయిన్‌గా ఒకప్పుడు నటించి, ఆ తర్వాత ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న అర్చన బిగ్‌బాస్‌ షోకు గ్లామర్‌ యాడ్‌ చేసిందని చెప్పవచ్చు. యూత్‌ మెచ్చే బట్టలు ధరిస్తూ ఎప్పుడూ లిప్‌స్టిక్‌ చెరగకుండా చూసుకుంటూ బ్యూటీ కాన్షియస్‌నెస్‌తో ఆమె ఈ షోలో స్క్రీన్‌కు అట్రాక్షన్‌ ఇస్తోంది. అయితే ఆమె ప్రవర్తనలో నస పెట్టే స్వభావం మాత్రం హౌస్మేట్స్ లోనే కాదు ప్రేక్షకులకూ నచ్చటం లేదు. . చిన్న విషయాన్ని కూడా అర్చన రోజుల తరబడి చర్చ చేయడం గమనించదగ్గ విషయం. మరి ఈ లోపాలతో ఉన్న అర్చన ఇప్పుడు టైటిల్ని పొందగలదా అంటే అనుమానమే…

నవదీప్ ఇక నవదీప్ విషయానికి వస్తే… షో లోకి రాకముందే డ్రగ్స్ కేసులో వివాదాస్పదుడు గా పెరుతెచ్చుకొని ఒక నెగెటివ్ ఇంప్రెషన్ తో హౌస్ లో అడుగు పెట్టాడు. అయితే నెగెటివ్ మనస్తత్వం తో కనిపించే నవదీప్ ఇక్కడ మాత్రం ఎక్కడా నటించినట్టు కనపడలేదు. తన స్వభావాన్ని పూర్తిగా అలాగే చూపించాడు. కొన్ని సారి మరీ ఇంత పొగరా అనిపించాల్సిన సందర్భాలలోనూ నా స్వభావం ఇదే అన్నట్టు ఉన్న నవదీప్ మంచి మార్కులనే కొట్టేసాడు అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి ఇతనుఇకి కూడా బిగ్ బాస్ టైటిల్ దక్కే అవకాశం తక్కువే…

ఆదర్శ్ ఆదర్శ్ …. షో మొదటినుంచీ ఉన్నవాళ్ళలో ఇతనూ ఒకడు అయినా,,,, బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న ఆదర్శ్, ప్రిన్స్‌ల మధ్య స్నేహం ఉంది. షోలో వీరు కలిసి కట్టుగా పాల్గొన్నారు. అయితే గత వారం ప్రిన్స్‌ ఎలిమినేట్‌ అయినప్పుడు మాత్రం ఆదర్శ్ కేకాదు చూసే ప్రేక్షకులకూ ఆశ్చర్యం అనిపించిన విషయం ‘మీ స్నేహాన్ని అడ్డు పెట్టుకుని ఆదర్శ్‌ గేమ్‌ ఆడాడా?’ అనే ప్రశ్నకు ప్రిన్స్‌ ‘ఔను’ అని సమాధానం చెప్పడం. ప్రిన్స్ చెప్పిన సమాధానానికి షాక్ తిన్న ఆదర్శ్‌ అలా ప్రిన్స్‌ ఎందుకు అన్నాడో తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. వాస్తవానికి బిగ్‌బాస్‌ షోలో కంపోజ్డ్‌గా జాగ్రత్తగా ఉన్న హౌస్‌మేట్స్‌లో ఆదర్శ్‌ ఒకడు. షోను గెలవదగ్గ స్థాయి పరిణితి కూడా అతడికి ఉంది. కానీ ప్రిన్స్ వేసిన నెగెటివ్ ముద్రకూదా ఉంది… ఆదర్శ్ టైటిల్ గెలవగలిగే చాన్స్ ని ఈ విషయం సగానికి సగం తగ్గించేసింది.

శివ బాలాజీ అయితే ఇక్కడ అన్నిటికంటే ఆశ్చర్యం ఏమిటంటే… మొదటినుంచీ కాస్త కన్నింగ్ అన్న ఇంప్రెషన్ తో ఉన్న శివ బాలాజీ ఫైనల్స్ వరకూ ఉండటం. నవదీప్ వచ్చిన సమయం లో ఈ ఇద్దరి మధ్యా గొడవ జరగొచ్చని అభిప్రాయ పడ్డారు చాలామంది. కానీ సివబాలాజీ చాలా సేఫ్ గేమ్ ఆడాడు. అయినా ఇప్పటికీ బాలాజీ గట్టి పోటీ ఇస్తూనే ఉన్నాడు చివరికి బిగ్ బాస్ ఇతనికే కిరీటం అని ప్రకటించినా ఆశ్చర్యం అవసరం లేదు. కనీ ఎందుకో చాలామంది ప్రేక్షకులకు మాత్రం శివబాలాజీ ఈ టైటిల్ కొట్టగలడన్న నమ్మకం కనిపించటం లేదు..

హరి తేజ హరి తేజ… ఇప్పటి వరకూ మొదటినుంచీ ఈమె అంత ఎక్కువ ఇంప్రెషన్ అటు పార్టిసిపెంట్లలోనూ ఇటు ప్రేక్షకులలోనూ ఎవ్వరూ కొట్టేయ్యలేదు. మొదట్లో ఎలా ఉందో చివరి వరకూ అదే రకమైన ఓపెన్ నెస్ తో ఉంది అంతే కాదు ఎక్కడా ఎవరినీ మాటమాత్రం నొప్పించకుండా ఉంటూనే తేడా వచ్చినప్పుడు ఆమె ఏదైతే సరైందో అటువైపే నిలబడింది… ఇక ఈమధ్య కాలం లో ఆమె బుర్రకథ చెప్పాల్సి వచ్చిన సమయం లో ఆమె టైమింగ్ కీ కామెడీకీ, ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక హౌస్ మేట్ల విషయం లోకూడా హరితేజ పట్ల ఎవ్వరికీ ఎక్కువ కోపం కానీ, మరీ ఎక్కువ వ్యతిరేకత కానీ లేవు. ఇప్పటికి దాదాపుగా ఈ టైటిల్ ని ఎగరేసుకు పోయే సత్తాఉన్న పార్టిసిపెంట్ హరితేజా అనే అన్నది చాలామంది నమ్మకం…

దీక్షా పంత్ అందరికంటే చివరగా మిగిలింది దీక్షా… పాపం ఇప్పటివరకూ ప్రేక్షకుల్లో కనీస గుర్తింపు రానిది ఈ అమ్మాయికే నిజానికి దీక్ష మీద ఎక్కువ నెగెటివ్ ఇంప్రెషన్ లేదు గానీ పాజిటివ్ కూడా ఏమీలేదు… ఆటలో అరటిపండు లాగా ఉంటూ షో కి కాస్త గ్లామర్ అద్దటానికి పనికి వచ్చిన ఒక యాడెడ్ అట్రాక్షన్ గా మాత్రమే పనికి వచ్చిందీ అమ్మాయి

ఎన్టీఆర్‌కు ఫుల్‌ మార్క్స్‌
బిగ్‌బాస్‌ షో మొదటివారం ఎన్టీఆర్‌ యాంకరింగ్‌ చూసినవారు కొంచెం ఈజ్‌గా చేయడం లేదు అని ఫీలైనా రెండో వారం నుంచి ఎన్టీఆర్‌ చెలరేగి పోయి కోట్లాది మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఊరికే మొక్కుబడిగా యాంకరింగ్‌ చేయడం కాకుండా షో ఫాలో అవుతూ అందరి తప్పొప్పులు గమనిస్తూ ఆయన ఈ యాంకరింగ్‌ చేస్తున్నాడని ప్రేక్షకులకు అర్థం కావడం వల్ల కూడా ఆయన యాంకరింగ్‌ నచ్చుతోంది. ఎన్టీఆర్‌ హౌస్‌మేట్స్‌తో పాటు తాను కూడా ఆటలు ఆడుతూ జోకులు వేస్తూ డాన్సులు చేస్తూ ప్రేక్షకులను చాలా ఆహ్లాదపరుస్తున్నారు. బిగ్‌బాస్‌ ఎన్ని సీజన్లు వచ్చినా ఆయనే యాంకర్‌ కావచ్చు. ఆయన వేసిన ముద్ర వల్ల ఆ తర్వాత యాంకర్‌లు మారితే జనానికి సంతృప్తి కలిగించడం చాలా కష్టమే అవుతుంది. ఏమైనా ఈ షో ముగియడానికి వచ్చింది. విజేతలు ఎవరైనా… మానసిక కాలుష్యం కలిగించే చాలా సీరియల్స్‌ కంటే ఈ షో ప్రేక్షకులకు ఆహ్లాదం పంచిందని చెప్పవచ్చు. ఈ షోకు వచ్చిన డిమాండ్‌ చూస్తుంటే సీజన్‌ 2లో ఇంకా పెద్ద సెలబ్రిటీలు పాల్గొంటారని, ఆ సీజన్‌ ఇంకా పెద్ద హిట్‌ కావచ్చని అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *