రామ్ చరణ్ ఆ హీరోకు లైఫ్ ఇస్తాడా..?

టాలీవుడ్ లో వెర్సటైల్ టాలెంట్ ఉన్న నటుల్లో నవదీప్ కూడా ఒకరు. అయితే ఏ కారణంగానో ఈ యంగ్ హీరోకు సరైన హిట్స్ పడలేదు. దాంతో రేస్ లో వెనుకబడిపోయాడు. స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యపాత్రలు, బుల్లితెరపై షో లు చేస్తున్నాడు తప్పితే, హీరోగా అవకాశాలు తక్కువ అనే చెప్పాలి. చివరిగా హీరోగా చేసిన ఐస్ క్రీమ్ సినిమా కూడా నిరాశపరిచింది. కీలకపాత్రల్లో ఆర్య 2, బాద్ షా, లేటెస్ట్ గా థృవ సినిమాల్లో చేశాడు నవదీప్. అయితే ఆర్య 2, బాద్ షా సినిమాల్లోని పాత్రలకు నవదీప్ కు పెద్దగా పేరు రాలేదు. నిన్న రిలీజైన థృవ ట్రైలర్ బట్టి చూస్తే మాత్రం, నవదీప్ మళ్లీ కెరీర్ ను పట్టాలెక్కించేలాగే కనిపిస్తున్నాడు. తమిళం లో వచ్చిన తనీ ఒరువన్ సినిమాలో హీరో ఫ్రెండ్స్ పాత్రలన్నింటికీ సమానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్ని పాత్రల్లోకి, నవదీప్ క్యారెక్టర్ కు యాక్టింగ్ కు మరింత ఎక్కువ స్కోప్ ఉంటుంది. చివరిలో నవదీప్ కోసమే రామ్ చరణ్ విలన్ తో పోరాడటం విశేషం.

తనీ ఒరువన్ లో ఈ పాత్రను రాహుల్ మాధవ్ చేశాడు. ఆ సినిమాలో పీక్ మూమెంట్స్ కు చేరే టైమ్ లో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ కు మంచి ఆదరణ లభించింది. తెలుగులో అదే పాత్రకు సురేందర్ రెడ్డి నవదీప్ ను ఎంచుకోవడం మంచి ఛాయిస్ అని చెప్పాలి. ఇక నవదీప్ కు కూడా హీరోతో సమానంగా ఫైట్ చేసే అవకాశం లభించింది. చాలా కాలం తర్వాత నవదీప్ కు మంచి పాత్ర
దక్కింది. మరి ఈ సినిమాతోనైనా నవదీప్ కు మళ్లీ లైఫ్ వస్తుందేమో చూడాలి..! చాలా తక్కువ టైమ్ లో 1 మిలియన్ వ్యూస్ ను దాటేసి, ఇప్పుడు 2 మిలియన్ వ్యూస్ వైపు దూసుకుపోతోంది. భారీ అంచనాలున్న ‘ థృవ ‘ డిసెంబర్ 9న బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *