జబర్దస్త్ షోలోకి శ్రీముఖి ఎంట్రీ ఇస్తుందా?

షో నుంచి కొన్ని కారణాల వల్ల నాగబాబు తప్పుకున్నారు. ఆయనతో జత కట్టిన ఆర్కే రోజా కూడా నిష్క్రమించారు. ఇప్పుడు మెల్లగా షోలో కామెడీ పండించే టాప్ కమెడియన్లు కూడా పక్కచూపులు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మల్లెమాల టీం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నెక్ట్స్ వీక్ నుంచి షోని ఎలా రక్తి కట్టించాలా అని తలలు పట్టుకుని కూర్చున్నారట. బిగ్ బాస్ 3లో టాప్ 2 వరకూ వచ్చిన యాంకర్ శ్రీముఖి కూడా తను జబర్దస్త్ షోను చాలెంజిగా తీసుకుంటానని అంటున్నట్లు సమాచారం. ఆ షోని మరో లెవల్లోకి తీస్కెళ్తాననీ, పరోక్షంగా నాగబాబుకి సవాల్ విసిరినంత పని చేస్తోందట శ్రీముఖి. మరి మెగా బ్రదర్ జారుకున్న జబర్దస్త్ షోలోకి శ్రీముఖి ఎంట్రీ ఇస్తుందా? అసలు మల్లెమాల టీం ఏం చేయబోతుందనేది తెలుసుకునేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *