హైదరబాద్ విప్రో డిజిటల్‌ ప్రొడక్ట్‌ కంప్లియన్స్‌ ల్యాబ్‌

విప్రో త్వరలో డిజిటల్‌ ప్రొడక్ట్‌ కంప్లియన్స్‌ ల్యాబ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు బుధవారం వెల్లడించింది. వినియోగదారుల నమ్మకం, భద్రతను చూరగొనేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఆటోమోబైల్‌, రక్షణ, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, వైమానిక రంగం, టెలికామ్‌, మెడికల్‌, ఎనర్జీ, తయారీ రంగాల్లోని వినియోగదారులకు సేవలు అందించేందుకు దీనిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

విప్రో తరంగ్‌ పేరుతో నిర్వహిస్తున్న క్వాలిఫికేషన్‌, కంప్లియన్సస్‌ ల్యాబ్‌కు అనుబంధంగా హైదరాబాద్‌లో కొత్తదానిని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్‌లో ఎలక్ట్రోమేగ్నటిక్‌ సామర్థ్యం, రక్షణ,  పర్యావరణ, వైఫై, బ్లూటూత్‌, షాక్‌ అండ్‌ వైబ్రేషన్‌, మెటీరియల్‌, వైద్య సదుపాయాల పరీక్షల కోసం దీనిని ఏర్పాటు చేయనున్నారు.  దక్షిణాసియాలో వైఫై, బ్లూటూత్‌ పరికరాలకు సర్టిఫికేషన్‌ ఇచ్చే అర్హత కేవలం తరంగ్‌ ల్యాబ్స్‌కు మాత్రమే ఉంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *