అవకతవకలు జరక్కుండా… బీజేపీ ఎంపీలను

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలల్లో బీజేపీ ఎంపీలను పోలింగ్ ఏజెంట్లుగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ వర్గాల సమాచారం. ఎంపీలు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ ఏజెంట్లుగా వెళ్తారు. అక్కడే కూర్చుని పోలింగ్ సరళని అత్యంత జాగ్రత్తగా గమనిస్తారు. పోలింగ్ జరిగే విదానాన్ని బట్టి గెలుపు అవకాశాలను అంచనా వేయడంతో పాటు ఎలాంటి అవకతవకలు జరక్కుండా చూసేందుకు పార్టీ ఈ వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. అభివృద్ధి ఎజెండాగా బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ఊదరగొట్టగా, ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాలు కొనసాగించడం, అందరికీ వైద్యం, నిరంతర విద్యుత్, నీటి సరఫరా, ప్రస్తుత సంక్షేమ పథకాల కొనసాగింపు, అవసరమైతే మరిన్ని సంక్షేమ పథకాల అమలుకు కట్టుబడతామన్న ప్రచారంతో ఆప్ మరోసారి ప్రజా తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందనే ధీమాతో ఉంది. 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో ఈనెల 8న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, 11న ఫలితాలు వెలువడతాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *