ఫేస్ క్రీమ్ రాసుకుంటున్నారా.. అయితే ఇక కోమానే…

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ ఫేస్ క్రీమ్ రాసుకోగానే కోమాలోకి జారుకుంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చావుబతుకులతో పోరాడుతోంది వివరాలు ఇలా ఉన్నాయి. 47 ఏళ్ల ఓ మహిళ చర్మంపై మచ్చలు, ముడతలు తొలగించే ఫేస్‌ క్రీమ్‌ను తక్కువ ధరకు మెక్సికో నుండి ఆర్డర్ చేసింది. దాన్ని ముఖానికి రాసుకోగానే ఆమె అస్వస్థతకు గురైంది. దీనితో కుటుంబికులు వెంటనే ఆమెను హాస్పిటల్‌లో చేర్చారు. ఆమె రాసుకున్న ఫేస్‌ క్రీమ్‌ను కూడా వెంట తీసుకెళ్లారు. ఆ క్రీమ్‌ను పరిశీలించిన వైద్యులు.. అందులో మేతేల్మెర్క్యూరీ (Methylmercury) అనే రసాయనం కలిసిందని తెలిపారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ ప్రెవెంక్షన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రసాయనం వల్ల నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. బాధితులు మస్తిష్క పక్షవాతం(Cerebral Palsy)కు గురవ్వుతారు.

ఈ ఘటన జులై నెలలో చోటుచేసుకోగా.. ఇప్పటికీ ఆమె ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కాలిఫోర్నియా పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఒలివియా కాసిరే మాట్లాడుతూ.. ‘‘ఇతర ప్రాంతాల నుంచి ఫేస్‌ క్రీమ్‌లు తదితర కాస్మోటిక్‌లను దిగుమతి చేసుకోవడం మంచిది కాదు. ఈ రసాయనం నరాల్లోకి చాలా సులభంగా చేరుకుంటుంది. కుంగుబాటు, నిద్రలేమి, తలనొప్పి, జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆత్రుత, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఏర్పడతాయి. గర్భిణీ స్త్రీలకు ఇది మరింత ప్రమాదకరం’’ అని తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *