ఆమెను ట్రాక్టర్ కు కట్టేసి కొట్టారు

సిరిసిల్ల జిల్లా చిన్నబోనలకు చెందినా ఓ మహిళను వివాహేతర సంబంధం పెట్టుకుందని  ట్రాక్టర్ కు కట్టేసి కొట్టారు. గ్రామానికి చెందిన లావణ్య భర్త నాగరాజు తొమ్మిది సంవత్సరాల క్రితం గల్ఫ్ దేశాలకు వెళ్ళాడు. పిల్లలు లేని ఆమె అదే గ్రామంలో బీడిలు చుడుతూ జీవిస్తుంది. ఇదే గ్రామానికి చెందిన నారాయణ ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అతనికి భర్య, పిల్లలు ఉన్నారు. ఈ విషయం బయటకు రావడంతో వారిద్దరూ గ్రామాన్ని విడిచి పారిపోయారు.

వారు సిరిసిల్లలోని శివనగర్‌లో ఒక ఇంట్లో అద్దెకు దిగారు. ఈ విషయం నారాయణ కుటుంబసభ్యులకు తెలియడంతో బుధవారం సాయంత్రం అక్కడికి వెళ్లి అతన్ని ఇంటికి పట్టుకుని వచ్చారు. మరుసటి రోజు లావణ్య అతని ఇంటికి వెళ్ళింది దీనితో ఆగ్రహానికి అతని కుటుంబ సభ్యులు ఆమెను ట్రాక్టర్ కు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను విడిపించి ఆస్పత్రికి తరలించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *