బిగ్‌బాస్ షోలో కుమారుడు అభిరామ్‌తో ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ ఈ వీకెండ్ మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది. ఈవారం యంగ్ టైగర్ తన వెంట బుల్లిటైగర్‌తో కలిసి కనిపించబోతున్నాడు. ఈ వీకెండ్ బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ శనివారం జరిగింది.
ఇదే రోజు (జులై 22) ఎన్టీఆర్ తనయుడు అభిరామ్ పుట్టినరోజు కూడా కావడంతో ఈ షోకు తన కుమారుడితో కలిసి బిగ్ బాస్ షూటింగుకు హాజరయ్యారు ఎన్టీఆర్. ఈ సందర్భంగా తన ముద్దుల కుమారుడికి బర్త్ డే విషెస్ చెబుతూ ఓ ఫోటో పోస్టు చేశారు.
బిగ్‌బాస్ షోలో కుమారుడు అభిరామ్‌తో కలిసి ఉన్న ఫోటోను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. మరి ఈ వీకెండ్ ప్రసారం అయ్యే షోలో ఈ బుల్లిటైగర్ కూడా కనిపిస్తాడో? లేదో? వేచి చూడాల్సిందే.
షూటింగులతో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే ఎన్టీఆర్ ఎక్కువ సమయం కొడుకుతో గడపలేకపోతున్నాడట. కొడుకు పుట్టినరోజు కూడా తప్పనిసరి చేయాల్సిన బిగ్ బాస్ షో ఉండటంతో…. అభిరామ్‌ను తన వెంట తీసుకొని షూటింగుకు వచ్చాడు.