యు ట్యూబ్ లో సినిమాలు ఇక ఫ్రీ కాదు

ఇది సినిమా అభిమానులకు షాక్ కలిగించే వార్త అయినప్పటికీ అతి త్వరలోనే కార్య రూపం దాల్చనుంది. అంబాని జియో పుణ్యమా అని లైవ్ వీడియో స్ట్రీమింగ్ కి బాగా అలవాటు పడిన జనం ఇది విని తట్టుకోవడం కష్టమే. ఇప్పటి దాకా యు ట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేసే విషయంలో వాటిని ఎన్నిసార్లైనా చూసుకునే విషయంలో ఎటువంటి రుసుము కాని ఆంక్షలు కాని లేవు. కాని వీటికి చెల్లు చీటీ వచ్చేసింది. నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచడం ఒరిజినల్ వీడియో ఓనర్లకు లాభం వచ్చేలా చేయటం దీని వెనుక ప్రధాన ఉద్దేశం.

ఈ మధ్య కాపీ రాయుళ్ళు సినిమాలు వాటికి సంబంధించిన క్లిప్స్ అన్ని డౌన్ లోడ్ చేసుకుని ఇష్టం వచ్చిన రీతిలో తిరిగి అప్ లోడ్ చేసి అనక వ్యూస్ ని తమ వైపు తెచ్చుకుంటున్నారు. దీని వల్ల లాభ పడాల్సిన వాళ్ళు కాక అప్పనంగా ఇతరులు లబ్ది పొందుతున్నారు. దానికి తోడు వింత వింత ఆకర్షణీయమైన హెడ్డింగ్ పెట్టి లోపల ఉత్తుతి వీడియోలు పోస్ట్ చేసి చూసేవాళ్ళను మోసం చేసే బ్యాచ్ కూడా ఇప్పుడు కోట్లలో ఉంది. సో ఇలాంటివాటికి చెక్ పెట్టడానికి ప్లస్ ఆదాయ మార్గంగా మెరుగుపరుకుకోవడానికి ఇదొక మార్గం అవుతుంది. ఇదెలా అనుకుంటున్నారా. చదవండి.

ఉదాహరణకు మీకు మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా ఆన్ లైన్ లో చూడాలి అనిపించింది. వెంటనే ఓపెన్ చేసి సెర్చ్ బటన్ లో మూవీ నేమ్ టైపు చేసి క్లిక్ చేస్తారు. వెంటనే మీకు ఆ మూవీ లింక్ ఉన్న బాక్స్ తో పాటు దాని ధర కూడా , పక్కనే ఉంటుంది. మీరు కేవలం కొద్ది రోజుల లోపు చూడాలి అనుకుంటే 25 రూపాయలు అద్దె ప్రకారం , లేదు ఇతరులతో షేర్ చేసుకోవడానికి అవకాశం లేకుండా మీరు మాత్రమే శాశ్వతంగా డౌన్ లోడ్ చేసుకునే విధంగా అయితే 200 రూపాయల దాకా పే చేయండి అని వస్తుంది. ఇప్పటికే ఇది అమలులో ఉంది.

ఇక ఆన్ లైన్ తెలుగు సినిమాల వరకు ఎన్నో హక్కులు పొంది యు ట్యూబ్ లో నిక్షిప్తం చేసుకున్న ప్రముఖ చానల్స్ వోల్గా వీడియో, మ్యాంగో టీవీ లాంటివి ఇప్పటికే ఇది స్టార్ట్ చేసాయి. కొన్ని సినిమాలకు ప్రస్తుతానికి ధరలు పెట్టినప్పటికీ ముందు ముందు ప్రతి వీడియో కు ఎంతో కొంత డబ్బు కట్టాల్సి అయితే ఉంటుంది. అసలు ఫ్రీ వీడియోస్ ఉండవా అంటే ఉంటాయి. కాని సినిమాలు, బాగా ప్రజాదరణ పొందిన టీవీ కార్యక్రమాలు మాత్రం ఉండవు. అదండి అసలు సంగతి. తెలుగు మాత్రమే కాదండోయ్ ఇది అన్ని బాషలకు వర్తిస్తుంది. కావాలంటే సమంతా రీమేక్ చేయాలి అనుకుంటున్నా కన్నడ సినిమా యు టర్న్ అని కొట్టి చూడండి. మీ డౌట్ క్లియర్ అయిపోతుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *