చలరేగిన యువీ..కళ్లలో నీళ్లు..!

కటక్‌: టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ (100; 98 బంతుల్లో 15×4, 1×6) తన అసలు సిసలు బ్యాటింగ్‌తో అభిమానులను మురిపించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో చక్కని బౌండరీలతో అద్భుత శతకం బాదాడు. మూడేళ్ల తర్వాత పునరాగమనం చేసిన యువీ శతకం చేయగానే కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. బ్యాట్‌ను డ్రెస్సింగ్‌ రూమ్‌ కేసి చూపించి తనలో పోరాట పటిమ ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. అవతలి ఎండ్‌లో ఉన్న ధోని వెంటనే వచ్చి యువీని అభినందించాడు.

కెరీర్‌లో 14వ శతకం బాదిన యువీ కళ్లలో భావోద్వేగంతో కూడిన కన్నీళ్లు కనిపించాయి. ప్లంకెట్‌ వేసిన 33 ఓవర్‌ చివరి బంతికి అతడు శతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ధోని (62) క్రీజులో ఉన్నాడు. 33 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 190/3తో ఉంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *