కత్రినా నవ్వంటే అతగాడికి ఎంతో ఇష్టమట

సెలబ్రిటీలు అంత త్వరగా తమ అభిమానాన్ని బాహాటంగా బయటపెట్టేందుకు ఇష్టపడరు. కానీ.. ఓవర్ నైట్ సెలబ్రటీగా మారిపోయిన యుజ్వేంద్ర చాహల్ మాత్రం అందుకు భిన్నం. తన మనసులోని మాటను ఓపెన్ గా చెప్పేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇతగాడి అభిమానం ఇప్పుడు ఎక్కడికి దారి తీస్తుందోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంతకీ యుజ్వేంద్ర చాహల్  ఎవరి మీద తనకున్న అభిమానాన్నిప్రదర్శించారన్న విషయంలోకి వెళితే.. బాలీవుడ్ బార్బీ డాల్.. తన అందంతో కోట్లాది మందిని ఫిదా చేయటమే కాదు.. యూత్ కి నిద్రల్లేని రాత్రుళ్లను మిగిల్చే కలల సుందరి కత్రినా కైఫ్ అంటే తనకెంత ఇష్టమో చెప్పుకొచ్చారు. తాజాగా ఇంగ్లండ్ తో ముగిసిన టీ 20 సిరీస్ లో సూపర్ స్పిన్నర్ గా పేరు తెచ్చుకోవటమే కాదు.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ను దక్కించుకొని రాత్రికి రాత్రే స్టార్ హోదాను తెచ్చుకున్న యుజ్వేంద్ర తాజాగా కత్రినా అంటే తనకెంత ఇష్టమో చెప్పుకొచ్చారు.

మీడియాతో మాట్లాడుతూ.. కత్రినా కైఫ్ అంటే తనకెంతో ఇష్టమని.. ఆమె నవ్వు అంటే చాలా ఇష్టమని.. ఆమెకు తాను పెద్ద ఫ్యాన్ అంటూ తన మనసులోని మాటను చెప్పేశారు. ఉన్నట్లుండి ఒక్కసారి ఫేమస్ అయిన యుజ్వేంద్ర అభిమానంపై కత్రినా ఎలా రియాక్ట్ అవుతుందో..?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *