పుల్వామా దాడిపై పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌

పుల్వామా ఉగ్రదాడిపై పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌  స్పందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్‌ తమను నిందిస్తుందని  ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు. భారత్‌ వద్ద సాక్ష్యాలు ఉంటే చూపించాలని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఘటన జరిగిన 5 రోజుల తర్వాత ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందించారు.  తామూ ఉగ్రవాదుల బాధితులమేనని, ఉగ్రకార్యకలాపాలతో ఇబ్బందుల ఎదుర్కొంటున్నామన్నారు. ఈ ఉగ్రదాడి దర్యాప్తులో భారత్‌కు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఉగ్రవాదంపై చర్చలకు పాక్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. కశ్మీర్‌ సమస్య సైనిక చర్యతో పరిష్కారం కాదని, చర్చలతోనే ఈ వివాదాన్ని పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు. భారత్‌ తమపై దాడి చేయాలని భావిస్తే…దీటుగా ఎదుర్కొంటామన్నారు. భారత్‌లో ఎన్నికల ఏడాది కనుకనే ఈ ఉగ్రదాడి విషయంలో పాక్‌ను నిందిస్తున్నారని పేర్కొన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *