బిగ్ బాస్ : సల్మాన్ కీ ఎన్టీఆర్ కి ఇదీ తేడా

హిందీలో పాపులర్ అయిన బిగ్ బాస్ షో మిగతా ప్రాంతీయ భాషలకు కూడా వెళ్ళింది. మలయాళం, కన్నడలో ఈ షో ఇప్పటికే వుంది. అయితే ఈ ఏడాది బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా గ్రాండ్ గా మొదలైన ఈ షో చివరి దశకు వచ్చింది. అర్చన, సమీర్‌, ముమైత్‌ఖాన్‌, ప్రిన్స్‌, మధుప్రియ, సంపూర్ణేష్‌బాబు, జ్యోతి, కల్పన, మహేష్‌కత్తి, కత్తి కార్తీక, శివబాలాజీ, ఆదర్శ్‌, హరితేజ, ధనరాజ్‌, నవదీప్, దీక్షపంత్.. వీళ్ళంతా తెలుగు బిగ్ బాస్ సీజన్ వన్ తెలుగు బిగ్ బాస్ సీజన్ వన్ పార్టిసిపెంట్స్. ఇందులో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అర్చన, హరితేజ, ఆదర్శ బాలకృష్ణ, శివబాలాజీ, నవదీప్, దీక్షపంత్ లు మిగిలారు. ఇందులో ఒకరు టైటిల్ విజేత కానున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో నెట్టుకురావడం అంత ఈజీకాదు. చాలా విలక్షణమైన షో ఇది. ఎదో సరదాకి ఈ షో పాపులర్ అయిపోలేదు. చాలా విలక్షణంగా ఈ షోను డిజైన్ చేశారు. హిందీలో వున్న ఫార్మేట్ నే తెలుగులో కూడా అప్లేయ్ చేశారు. హిందులో సల్మాన్ కి తీసుపోకుండా ఎన్టీఆర్ తన ఎనర్జీతో ఈ షోకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. నిజంగా ఎన్టీఆర్ ఒక టీవీ షోని ఇంత ఎనర్జీతో రన్ చేస్తారని చాలామంది అనుకోని వుండరు. ఎందుకంటే ఒక పుటలో లేదా రోజులో తేలిపోయే షో కాదిది. బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో ప్రతీ అప్డేట్ హోస్ట్ కి తెలియాలి. తెలుసుకోవాలి. వీడియోస్ చూడకపోయినా ప్రోగ్రామ్ ప్రొడ్యుసర్స్ చెబితే వినాలి. విషయాల్ని , ఇంట్లో వ్యక్తుల స్వభావాల్ని అర్ధం చేసుకొని ఒక హోస్ట్ గా హౌస్ ని కంట్రోల్ చేసి ముందుకు తీసుకువెళ్ళే భాద్యత నిర్వర్తించడం మామూలు విషయం కాదు. దానికి చాలా ఓపిక కావాలి. ఆ ఓపిక ఎన్టీఆర్ కి కావాల్సినంత వుందని ఈ షో ద్వార మరోసారి రుజువయ్యింది.

ఈ షో మొదలైనప్పుడు ఎన్టీఆర్ ఎలాంటి ఎనర్జీతో వున్నారో.. రెండు నెలలుపై గడుస్తున్నా అదే ఉత్సాహం ఆయనలో కనిపిస్తుంది. ఎక్కడా లో అవ్వలేదు. ఈ షోని హిందీలో హోస్ట్ చేస్తున్న సల్మాన్ అప్పుడప్పుడు పార్టిసిపెంట్స్ పై అసహనం వ్యక్తం చేయడం, వార్నింగులు లాంటివి ఇవ్వడం చేస్తుంటారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా అసహనం వ్యక్తం చేయలేదు. చాలా ఓపికతో షోని నిర్వహించారు. ఇంట్లో వ్యక్తులను పొరపాటున కూడా ఏక వచనంతో సంబోధించలేదు. ‘గారు’ అనే మాట తప్పితే ఎప్పుడూ హార్స్ ట్రీట్ మెంట్ చేయలేదు. ఇది ఎన్టీఆర్ సంస్కారానికి అద్దం పడుతుంది. వాస్తవానికి ఈ షో మొదలైనప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ అనగానే.. బుల్లితెరపై ఆయన ఎలా వుంటారో అనే చాలా సందేహాలు. కాని ఎన్టీఆర్ మాత్రం వాటిని పటాపంచలు చేశారు. తనకు అన్నీ తెరలు ఒక్కటే అని రుజువుచేశారారు బిగ్ బాస్ తో. ఈ షో మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ ‘స్టార్ మా’కి అత్యధిక రేటింగులు వచ్చిన షోఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ కావడం ఇందుకు నిదర్శనం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *