జూకర్‌ ను చంపేసిన ఫేస్‌ బుక్‌..!

జుకర్ బర్గ్. ప్రపంచాన్ని అనుసంధానం చేసిన వ్యక్తి. ఆయన పేరు తెలియని యువత ఉండదు. ఫేస్ బుక్‌లోని తన వాటాలో 99శాతం చారిటీకి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఫేస్ బుక్‌ను యువతకు దగ్గర చేయడంలో జుకర్ తనవంతు పాత్రను పోషించాడు. అయితే, అలాంటి ఫేస్ బుక్‌ జుకర్‌కు పెద్ద షాకిచ్చింది. ఫేస్‌బుక్‌ సిబ్బంది పెద్ద తప్పు చేసి తర్వాత నాలుక్కరుచుకున్నారు. భారీ సంఖ్యలో ఫేస్‌బుక్‌ యూజర్లు చనిపోయినట్టు శుక్రవారం పొరపాటుగా నిర్ధారించారు. వీరిలో ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జూకర్‌బర్గ్‌ పేరు కూడా ఉంది. పొరపాటు తెలుసుకున్న ఫేస్‌బుక్‌ యాజమాన్యం యూజర్లకు క్షమాపణలు చెప్పింది.

చనిపోయిన వారి స్మారక ప్రొఫైల్స్‌ను ఇతర ఎకౌంట్లలో పోస్ట్‌ చేశారు. వీటిని చూసి యూజర్లు అవాక్కయ్యారు. కొందరు నెటిజెన్లు ఫేస్‌బుక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఫేస్‌బుక్‌ యాజమాన‍్యం ఓ ప్రకటనలో క్షమాపణలు చెబుతూ.. పెద్ద తప్పు జరిగిందని, వీలైనంత త్వరగా దీన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. దాదాపు 20 లక్షల మెమోరియల్‌ ప్రొఫైల్స్‌ను పోస్ట్‌ చేశారు.

ఇటీవలె 54 బిలియన్ డాలర్ల (రూ.36,0747 కోట్ల) సంపదతో టెక్ రంగంలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన ఆయన.. ఒరాకిల్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ల్యారీ ఎలిసన్ను అధిగమించారు. గత ఏడాది కాలిఫోర్నియా అత్యంత సంపన్నుడి టైటిల్ ఎలిసన్ కు దక్కింది.గతేడాది డిసెంబర్‌లో తమ సంపదలో 99 శాతాన్ని ధార్మిక కార్యకలాపాలకు ఇస్తామంటూ జుకర్‌బర్గ్ దంపతులు ప్రకటించిన అనంతరం వేసిన మొదటి అడుగు కూడా వేశారు.

దాదాపు రూ. 20,100 కోట్లు… ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అతని భార్య ప్రిస్కిల్లా చాన్‌లు వచ్చే పదేళ్లలో వ్యాధుల నిర్మూలనకు వెచ్చించనున్న మొత్తం… ఈ శతాబ్దం చివరి నాటికి అన్ని వ్యాధుల్ని రూపుమాపాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యం సాధించే క్రమంలో గురువారం ఈ భారీ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *