నారా రోహిత్ ‘కథలో రాజకుమారి’ టీజర్

నారా రోహిత్ ఎంచుకొనే క‌థలు కాస్త డిఫ‌రెంట్‌గానే ఉంటాయి. దానికి తోడు కొత్త కొత్త టైటిళ్లు దొరుకుతుంటాయి. మ‌రోసారి ఓ కొత్త క‌థ‌తో.. కొత్త టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. అదే ‘క‌థ‌లో రాజ‌కుమారి’. రోహిత్‌, నాగ‌శౌర్య‌, నందిత ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. మ‌హేష్ సూర‌ప‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. టీజ‌ర్‌.. ఈరోజే బ‌య‌ట‌క వ‌చ్చింది. ”నాకెన్నో రూపాలు – నాకేవో కోపాలు.. కానీ ఒక్క‌టే ప్రేమ” అంటూ కాస్త పొయెటిక్‌గా మొద‌లైంది టీజ‌ర్‌. ‘అంత ఈజీనా, మ‌నం ప్రేమించేవాళ్ల‌పై ప‌గ తీర్చుకోవ‌డం?’ అంటూ ఓ ట్విస్ట్ ఇచ్చాడు నారా రోహిత్‌. రోహిత్‌తో పాటు.. శౌర్య‌కూడా కాస్త డిఫ‌రెంట్ గెట‌పులోనే క‌నిపిస్తున్నారు. టైటిల్‌లో, టీజ‌ర్లో ఉన్న పొయెట్రీ.. రేపు వెండి తెర‌పైనా క‌నిపిస్తే – కొత్త త‌రహా ప్రేమ క‌థ‌గా నిల‌బ‌డిపోతుంది. ‘నా ప్రేమ‌క‌థ‌కి నేనే హీరో – నేనే విల‌న్ ‘ అంటూ… ఈ సినిమా క‌థ చూచాయిగా చెప్పేశాడు రోహిత్‌. టీజ‌ర్ చూస్తుంటే ప్రామిసింగ్‌గానే క‌నిపిస్తోంది మ‌రి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *