ట్రైలర్ : “నేనే రాజు నేనే మంత్రి” సాయంత్రానికి సీఎం అవుతా

చాలా సందర్భాల్లో రీల్ కి రియల్కు మధ్య పొసగదు. కొన్నిసార్లు మాత్రం రియల్కు దగ్గరగా తీసే సినిమాలు వస్తుంటాయి. అలాంటి వాటికి ప్రేక్షకాదరణ కూడా ఉంటుంది. అయితే.. పంచ్ డైలాగులతో నేల విడిచి సాము చేసేలా డైలాగులు ఉంటేనే ఇబ్బంది. తాజాగా విడుదలైన  నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్ చూస్తే ఇదే విషయం అనిపిస్తుంది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. కొన్నికీలక స్థానాలకు సంబంధించి డైలాగులు రాసేటప్పుడు కాస్త ఆలోచించి రాస్తే బాగుంటుందేమో.

‘వందమంది ఎమ్మెల్యేలను స్టార్ హోటల్‌లో కూర్చోబెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం’ అంటున్నాడు దగ్గుబాటి రానా. అతడి చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ లోని డైలాగ్‌ ఇది. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘లెక్కేసి కొడితే ఐదేళ్లలో సీఎం సీటు నా ముడ్డి కింద ఉండాలి. పాముకు పుట్ట కావాలంటే చీమలే కదా కష్టపడాలి’ అంటూ రానా చెప్పిన డైలాగులు అభిమానులను అలరించేలా ఉన్నాయి. ఇంతకుముందు విడుదలైన టీజర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది.

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజకీయ నాయకుడి పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. రానా సరసన కాజల్, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను డి. సురేశ్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *