ధోనిని ఎంపిక చేయని కమిటీ…

దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌కు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ జట్టును ప్రకటించింది. అయితే టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీకి చోటు దక్కలేదు. అతని స్థానంలో యువ ఆటగాడు రిషభ్‌పంత్‌ని ఎంపిక చేశారు. సైనిక విధులు పూర్తి చేసుకొని వచ్చిన ధోనీని దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేస్తారని భావించినా అలా జరగలేదు. అయితే మహీని ఎందుకు ఎంపిక చేయలేదో సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపారు. ఎంపికకు అతడు అందుబాటులో లేడని వెల్లడించాడు. లెహ్‌ నుంచి వచ్చిన ధోనీ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో పర్యటిస్తున్నాడని తెలిసింది. దీంతో తాము ముందుకు పోవాల్సి వచ్చిందని ఎమ్మెస్కే పేర్కొన్నారు. అయితే ఇదిలా ఉంటే బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యులు ఒకరు మాత్రం ధోనీయే మాకు టైమ్ ఇచ్చాడు. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌ నాటికి జట్టు సన్నాహకాల్లో భాగంగా ధోని విశ్రాంతి తీసుకుంటున్నాడు. యువ క‍్రికెటర్లతో జట్టును పరీక్షించమని మాకే ఎంఎస్‌ సమయం ఇచ్చాడు. జట్టు ప్రయోజనాలే ధోనికి ముఖ్యం. నిజానికి పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో రిషభ్‌ పంత్‌కు గాయమైతే మాకు సరైన ప్రత్యామ్నాయ కీపర్‌ లేడు. అందుకే ధోని ఆగిపోయాడని చెప్పుకొచ్చాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *