యాంకర్ కి లైవ్ లో పెళ్లి ప్రపోజల్…

నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ మూవీ ఇప్పటికే హిట్ అయిపోయింది. మొదటి వారంలో పెట్టుబడికి రెట్టింపు రాబట్టి.. సూపర్ హిట్ అనిపించేసుకుంది. ఇంకో వారం కలెక్షన్స్ స్టడీగా నిలబడితే.. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సాధించిన చిన్న సినిమాల లిస్ట్ లోకి కూడా ఎంటర్ అయిపోవడం ఖాయం.

ఈ మూవీ ఇంతగా హిట్ అవడానికి టైటిల్ తోపాటు.. సినిమా యూనిట్ చేసిన ప్రమోషన్స్ కూడా కారణమే. ప్రచారంలో భాగంగా.. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ మూవీలో నటించిన ముగ్గురు హీరోలు తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. ఓ ఛానల్ కి నోయల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ‘ నిజంగానే ఓ అమ్మాయి ఇలా చేస్తే మీరేం చేస్తారు’ అని నోయల్ ని ప్రశ్నించింది ఆ యాంకర్.

దీనికి నోయల్ ఇచ్చిన ఆన్సర్ దిమ్మదిరిగిపోయేలా చేసింది. ‘నాకు ఓ వంద మంది గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారు.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే నువ్వేమంటావ్ చెప్పు’ అంటూ నోయల్ అడిగేసరికి.. ఆ యాంకర్ కి లైవ్ లోనే చుక్కలు కనిపించాయి. మొత్తానికి నవ్వుతో కవర్ ఈ సిట్యుయేషన్ ని కవర్ చేసేసింది కానీ.. నోయల్ స్పాంటేనియస్ రియాక్షన్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *