పౌరసత్వ సవరణ చట్టం పై

పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో మతపరమైన పీడనకు గురై శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించాలన్న తమ నిర్ణయం 1000 శాతం సరైనదని ప్రధాని మోదీ అన్నారు. వారి జీవితాలను మెరుగుపరిచి, వారికి గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు, హింస వెనుక ప్రతిపక్షాల హస్తం ఉందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై నిన్న ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ ఇవాళ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ సి. హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే దీనిపై అత్యవసర విచారణ చేపట్టేందుకు నిరాకరించిన కోర్టు.. రిజిస్ట్రీ ద్వారా రావాలని పిటిషనర్ రిజ్వాన్ నజ్మీకిసూచించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిన్న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆందోళనపై అత్యవసర జ్యూడీషియల్ విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు పక్కనబెట్టింది. ఆదివారం జరిగిన ఘర్షణల్లో గాయపడిన విద్యార్ధులకు వైద్య సాయం అందించాలని పిటిషనర్ కోరారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *