పవన్.. అలోచించి డెసిషన్ తీసుకో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేనంత స్పీడ్ చూపిస్తున్నాడు సినిమాలు కంప్లీట్ చేసే విషయంలో. ‘కాటమరాయుడు’ మార్చ్ లో రిలీజ్ చేయాలనే డెడ్ లైన్ పెట్టుకుని మరీ వర్క్ చేయిస్తున్న పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ మూవీస్ గురించి కూడా మరోవైపు అంతే శ్రద్ధ తీసుకుంటున్నాడు. డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాటమరాయుడు’ యూనిట్ ప్రస్తుతం కేరళ పోలచ్చిలో ఉంది. అక్కడే ఓ సాంగ్ షూటింగ్ కూడా ప్లాన్ చేసారు. తన ఇండస్ట్రీ హిట్ ‘గబ్బర్ సింగ్’లో పార్టనర్ ఐన శృతిహాసన్ ని ఏరికోరి మరీ తెచ్చుకున్న పవన్ కు ఇప్పుడు తనే చిన్నపాటి సమస్యగా మారిందనే టాక్ గుప్పుమంటోంది. షూటింగ్ ఆలస్యంగా రావడం, లేట్ నైట్ పార్టీల పేరుతో ఉదయాన్నే ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ కి పూర్తిగా సహకరించకపోవడం లాంటి కారణాల వాళ్ళ నిర్మాత శరత్ మరార్ ఇబ్బంది పడుతున్నాడని టాక్. ఇందులో నిజమెంతుందో కాని అదేపనిగా తెచ్చుకున్న అమ్మడితో పెద్దచిక్కులే వచ్చాయని అంటున్నారట. ఇక పవన్ తన తర్వాతి సినిమా త్రివిక్రమ్ తో మొదలుపెడతాడా లేక నీసన్ తో చేయనున్న ‘వేదాలం’ రీమేక్ తో స్టార్ట్ చేస్తాడా అనే క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు మరో న్యూస్ పవన్ ఫాన్స్ ని ఖంగారు పెడుతోంది.

‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాధం’ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా, పూజ హెగ్డే హీరొయిన్ గా నటిస్తున్న ఆ మూవీలో సెకండ్ హీరొయిన్ కోసం వేట కొనసాగుతోంది. ఇక ఆ సినిమా సమ్మర్ లోపు ఎలాగు రిలీజ్ అవుతుంది కాబట్టి తన నెక్స్ట్ మూవీ ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే ‘గబ్బర్ సింగ్ 3’ అన్నమాట. దీనికి సంబంధించి ఓ మాట పవన్ చెవిలో వేస్తే ఆయన కూడా స్టొరీ లైన్ తో వస్తే ఆలోచిస్తానని చెప్పడంతో ఆ పనిలో కూడా ఉన్నాడట పవన్. అయితే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పుణ్యమా అని ఆ బ్రాండ్ కి బాగా డ్యామేజ్ జరిగింది. ఇక దాన్ని వదిలేసి ఫ్రెష్ కాన్సెప్ట్ తో పవన్ ని ఎందుకు చూపకూడదు అని అడుగుతున్నారు పవన్ ఫాన్స్. సీక్వెల్స్ టాలీవుడ్ లోనే కాదు ఏ బాషలోను వర్క్ అవుట్ అవ్వడం లేదు. అలాంటప్పుడు ఎందుకు రిస్క్ చేయడం అనేది వాళ్ల ప్రశ్న. నిజమే మరి.. స్టార్ హీరోస్ ని వీలైనంత కొత్త సబ్జక్ట్స్ లో చూపించినప్పుడే ఫాన్స్ కి కూడా కిక్ వస్తుంది. అందుకే ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ అంటే మాత్రం ఆలోచించు పవన్ అంటున్నారు ఫాన్స్. ఒకవేళ ఓకే అయినా ఇప్పట్లో సెట్స్ కు వెళ్ళే అవకాశం అయితే దాదాపు లేదు.. చూద్దాం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *