చరిత్ర తిరుగరాసే పాత్రలో రానా.. రెజీనాతో నిశ్చితార్థం?..

వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న రానా దగ్గుబాటి మరోసారి సత్తా చూపేందుకు సిద్దమవుతున్నాడు. బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి సక్సెస్‌లతో దక్షిణాదిలో సుస్థిరమైన స్థానం సంపాదించుకొన్నాడు. అదే జోష్‌తో 1945 కాలం నాటి ఓ చారిత్రాత్మక చిత్రంలో నటించనున్నట్టు తాజాగా రానా ట్వీట్ చేశారు. ఈ చిత్రం స్వాతంత్రానికి పూర్వం జరిగిన సంఘటల ఆధారంగా తెరకెక్కనున్నట్టు ప్రాథమిక సమాచారం.

1945గా పేర్కొంటున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నది. రెండో షెడ్యూల్‌ను తాజాగా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో రానా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మరోసారి చరిత్రను తిరగరాయబోతున్నాం. 1945 కాలంలోకి తిరిగి వెళ్లిపోతున్నాం. 1945 సినిమాకు సంబంధించిన మరో భారీ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్నాం అని రానా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

1945 చిత్రంలో పలు రకాల గెటప్స్‌ కూడా ఉన్నట్టు రానా మరో హింట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని ఓ గెటప్ గురించి విజయ్, జైపాల్ తీవ్రంగా కృషిచేస్తున్నారు అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

హీరోయిన్‌గా రెజీనా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్‌గా నటిస్తున్నది. రానాతో నిశ్చితార్థం జరిగి పెళ్లికి సిద్ధమయ్యే చెట్టియార్ అమ్మాయి పాత్రలో నటిస్తున్నది.

తన పాత్రపై రెజీనా స్పందిస్తూ .. నేను చెట్టినార్ కులానికి చెందిన యువతిగా నటిస్తున్నాను. ఈ చిత్రంలో పూర్తిగా నేను చీరకట్టులోనే కనిపిస్తాను. మేకప్ లేకుండా చాలా సాదా సీదాగా కనిపిస్తాను. చెన్నై, కోచిలో జరిగిన షూటింగ్‌లో కొన్ని సన్నివేశాలు నాపై చిత్రీకరించారు అని రెజీనా పేర్కొన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *