సచిన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా సచిన్: ఎ బిలియన్స్ డ్రీమ్స్. ఇందులో మాస్టరే స్వయంగా తన పాత్రను పోషించాడు. అయితే ఈ సినిమా కోసం మాస్టర్ తీసుకున్న రెమ్యునరేషన్‌పై బాలీవుడ్లో పెద్ద టాకే నడుస్తున్నది. ఈ మూవీ కోసం సచిన్‌కు ఏకంగా రూ.35 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అది రూ.40 కోట్ల వరకు ఉండొచ్చు. కచ్చితంగా అంత కాకపోయినా.. రూ.35 కోట్ల నుంచి రూ.38 కోట్లు ఇచ్చి ఉండొచ్చు అని ఈ సినిమా టీమ్‌లోని ఓ వ్యక్తి చెప్పడం విశేషం. అయితే సినిమాకు మంచి టాకే వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా ఓపెనింగ్స్ రాలేదు. తొలి మూడు రోజుల్లో కేవలం రూ.27 కోట్లు మాత్రమే సచిన్ వసూలు చేసింది. అంటే సచిన్‌కు ఇచ్చిన రెమ్యునరేషన్ డబ్బులు కూడా ఇంకా రాలేదు.