సులేమానీ అంత్యక్రియల్లోభారీ తొక్కిసలాట

టెహ్రాన్‌: అమెరికా దాడుల్లో మృతిచెందిన ఇరాన్‌ ఇరాన్ అగ్రశ్రేణి సైనిక జనరల్ ఖాసిమ్ సులేమానీ అంత్యక్రియల్లో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 35 మంది మరణించగా, మరో 50 మంది వరకు గాయపడ్డారు. అమెరికా డ్రోన్ దాడిలో హతమైన సులేమానీ అంత్యక్రియలు కెర్ మన్ పట్టణంలో జరిగాయి. సులేమానీ అంతిమయాత్రకు లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. దాంతో తొక్కిసలాట ఏర్పడడంతో పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ ప్రభుత్వ టీవీ చానల్ వెల్లడించింది.ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేయగా.. అందులో పలువురు రోడ్డుపై విగత జీవులుగా కనిపించగా.. మరికొందరు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తూ కనిపించారు కాగా, సులేమానీ అంతిమయాత్రలో అనేకమంది పొరుగుదేశాల నేతలు కూడా పాల్గొన్నారు.

బాగ్దాద్‌లో శుక్రవారం అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో సులేమానీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతని మృతదేహాన్ని టెహ్రాన్‌కు తరలించారు. సులేమానీ అంతిమయాత్రలో ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ సహా సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీ పాల్గొన్న అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిన బూనారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *