సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌గా ట్రెవర్ బేలిస్

ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్ బేలిస్  ఇంగ్లండ్‌ జట్టును విశ్వ విజేతగా నిలిపి ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌గా పేరున్నాడు. ఇతను ఇప్పుడు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. సన్‌రైజర్స్‌ కు టామ్ మూడీ హెడ్‌ కోచ్‌గా ఉన్నాడు. అతని స్థానంలో ట్రెవర్ బేలిస్ బాధ్యతలు చేపట్టనున్నాడు.  ఇతడి ఆధ్వర్యంలోనే ఇంగ్లాండ్ జట్టు 2015 యాషెస్‌ సిరీస్‌ను 3–2 తేడాతో గెల్చుకుంది. 2016 టి20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ చేరింది. అనంతరం వన్డేల్లో నంబర్‌వన్‌గానూ అవతరించింది. ఇప్పుడు వన్డే ప్రపంచ  కప్‌నూ సాధించింది.

ఆగష్టు నెలలో ప్రారంభమయ్యే యాషెస్‌ సిరీస్‌తో ఇంగ్లండ్‌ జాతీయ జట్టుతో బేలిస్‌ ఒప్పందం ముగుస్తుంది.  2010–11లో అతడు ఆస్ట్రేలియా టి20 లీగ్‌ బిగ్‌ బాష్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. తర్వాత శ్రీలంక 2011 ప్రపంచ కప్‌లో ఫైనల్‌ చేరినప్పుడు బేలిస్‌ ఆ దేశ కోచ్‌గా ఉన్నాడు. 2012–15 మధ్య కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రెండుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన సందర్భంలోనూ అతడే శిక్షకుడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *