‘బాహుబలి’కి ముందు అనుకున్న కథ వేరు…

బాహుబలి-2 రిలీజైంది, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే సీక్రెట్ అందరికీ తెలిసిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేయడంతో పాటు ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొడుతోంది. కథ పరంగా, పాత్రల పరంగా, విజువల్స్ పరంగా సినిమా హైలెట్. సినిమాలో ప్రతి పాత్ర ప్రేక్షకుడికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దారు. ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు. ఇపుడు మనంతెరపై చూసిన కథ, సినిమా తెరకెక్కించడానికి ముందు అనుకున్న కథ వేరు అని ఆయన తెలిపారు.

కట్టప్ప నుండే మొదలు సినిమాలో కట్టప్ప పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. వాస్తవానికి ‘బాహుబలి’ కథ పుట్టిందే కట్టప్ప పాత్ర నుండి అని అంటున్నారు రచయిత విజయేంద్రప్రసాద్. కట్టప్ప పాత్ర నుండే కథ మొదలు పెట్టి దానికి అనుణంగా ఇతర పాత్రలను క్రియేట్ చేస్తూ వెళ్లారట.

ముందు అనుకున్న కథ మేము ముందుగా అనుకున్న కథ ప్రకారం….. కట్టప్ప పిల్లలకు యుద్ధ విద్యలు నేర్పిస్తుంటాడు, ఒక రోజు అతడి దగ్గరికి ఓ విదేశీయుడు వస్తాడు. ‘ఇంత గొప్పగా యుద్ధం చేస్తున్నారు… నేనింత వరకూ మీలాంటి వీరుడ్ని చూడలేదు’ అని నమస్కరిస్తాడు. అప్పుడు కట్టప్ప ‘నాకంటే గొప్ప వీరుడు మరొకడు ఉన్నాడు. అతని పేరు బాహుబలి. అతన్ని యుద్ధంలో ఎవ్వరూ గెలవలేరు..’ అంటూ విదేశీయుడికి బాహుబలి కథ చెప్పడంతో స్టోరీ మొదలవుతుందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.బాహుబలి కథ విని అతడిని చూడాలని ఉంది. నాకోసారి చూపిస్తారా అని విదేశీయుడు అడిగితే ‘ఇప్పుడతను లేడు. చనిపోయాడు’ అని బదులిస్తాడు. ‘అంతటి వీరుడన్నారు. ఎలా చనిపోయాడు’ అని అడిగితే.. ‘కత్తిపోటు కంటే బలమైనది వెన్నుపోటు. నేనే అతన్ని పొడిచి చంపేశా’ అంటూ బాహుబలి గురించి చెప్పడం మొదలుపెడతాడు కట్టప్ప అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

కట్టప్ప విదేశీయుడికి కథ చెప్పే క్రమంలో ఇతర పాత్రలను అల్లుకుంటూ వెళ్లాం. శివగామి పాత్ర కూడా తర్వాత పుట్టిందే. సినిమాలోని ఒక్కోపాత్ర అలా అల్లుకుంటూవెళ్లాం. అయితే చివరకు సినిమా కథను ఇపుడు మీరు తెరపై చూసిన విధంగా మార్పులు చేసామని విజయేంద్రప్రసాద్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ స్పూర్తితోనే ‘బాహుబలి-2’లో ఆ సీన్ : విజయేంద్రప్రసాద్ భల్లాలదేవుడికి మహారాజుగా పట్టాభిషేకం జరిగినా…. అతనిలో సంతృప్తి ఉండదు. అందుకు కారణం బాహుబలికే ప్రజామద్దతు ఉండటం. ఈ సీన్ ఎలా రాయాలి అని ఆలోచిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ గుర్తుకొచ్చాడని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *