శభాష్ జగన్..పార్టీకి అతీతంగా.. హరికృష్ణ‌కు ఘన నివాళి!

నందమూరి హరికృష్ణ‌ మరణం పట్ల చాలా అర్థవంతంగా స్పందించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. హరి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు. అయినప్పటికీ ఆయనను పార్టీకి అతీతంగా.. మానవతా ధోరణితో చూసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకించి వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అయితేనేం.. ఆ పార్టీ శ్రేణులు అయితేనేం.. హరి మరణం పట్ల మనవతా ధోరణితో స్పందించాయి.

సోషల్ మీడియాలో వైకాపా కార్యకర్తలు, వైకాపా అభిమానులు కూడా హరికి ఘన నివాళి ఘటించారు. ఆయన మరణం పట్ల విషాదభరితులయ్యారు. శ్రద్ధాంజలి ఘటించారు. హరి కుటుంబానికి సానుభూతి తెలిపారు. హరికి తెలుగుదేశం వారితో తీసిపోని విధంగా వైకాపా తరఫు నుంచి నివాళులు వెల్లువెత్తాయి.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా హరికృష్ణ‌కు ఘన నివాళి ఘటించారు. పాదయాత్రలో నిన్న భారీగా జన సందోహం చేరిన సమయంలో జగన్ హరికృష్ణ‌కు నివాళి ఘటించారు. అన్ని వేల మంది ప్రజల ముందు తమ ప్రత్యర్థి పార్టీ నేతకు జగన్ నివాళి ఘటించడం అభినందనీయం.

ఆఖరికి వైఎస్ మరణం విషయంలో కూడా పచ్చ పార్టీ వాళ్లు నీఛమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్ మాత్రం మానవతాధోరణితో స్పందించి అభినందనీయులు అవుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *