పవన్ కొడుకేంటి..నోరెళ్లబెట్టేలా చేశాడు..!!

స్టార్ హీరోల తనయుల గురించి అభిమానుల్లో చర్చ జరుగుతోనే ఉంటుంది. వారు ఓ వయసుకు వచ్చాక సినీరంగ ఎంట్రీ పై ఆ చర్చ మరింతగా పెరుగుతుంది. వాళ్లు మీడియా దృష్టిలో పడ్డా.. అభిమానులకు కనిపించినా.. రకరకాల చర్చలు ఆరంభమవుతాయి. పవన్ కళ్యాణ్ పిల్లలు ఈ హడావుడి ఏమీ లేకుండా పుణెలో పెరుగుతున్నప్పటికీ ఎప్పుడైనా మన జనాల కళ్లల్లో పడ్డారంటే వార్తాంశాలు పుట్టుకొచ్చేస్తాయి.

అప్పుడప్పుడూ వాళ్ళ అమ్మ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో అకీరా ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అవి వైరల్గా మారడం అభిమానుల్లో వాటి గురించి చర్చ జరగడం కామన్ అయిపోయింది.కాగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే చిత్రం చిత్రం కోసం ఇటీవల బల్గెరియా వెళ్ళాడు. తిరిగి వస్తూ హైదరాబాద్ లో ఎయిర్ పోర్టులో కనిపించారు. పవన్ కళ్యాణ్ వెనుకన పొడవుగా ఉన్న ఓ కుర్రాడు కనిపిస్తాడు. అతడు ఎవరో కాదు.. అకీరా నందనే. కాగా అకీరా హైట్ గురించి అభిమానులు సరదాగా చర్చించుకుంటున్నారు.

అకీరా కూడా సినిమాల్లోకి రావడం గ్యారెంటీ అన్న అభిప్రాయంతో ఉన్న ఫ్యాన్స్.. మరో ప్రభాస్.. వరుణ్ తేజ్.. రానా లాంటి ఆజానుబాహుడైన హీరో దొరికేసినట్లే అంటూ కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *