V6 ఛానెల్‌కు బిత్తిరి సత్తి రాజీనామా!

‘తీన్మార్’ ప్రోగ్రాంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బిత్తిరి సత్తి వీ6 ఛానల్‌కు రిజైన్ చేసినట్లు సమాచారం. తెలంగాణ యాసతో తనదైన శైలిలో ప్రేక్షకుల్ని కట్టి పడేసే సత్తి అలియాస్ రవి కెరీర్‌ను వీ6లోనే ఆరంభించాడు. సత్తికి ఇటీవల పాపులారిటీ బాగా పెరిగింది. దీంతో అతడు తీన్మార్ కోసం పని చేస్తూనే బయట కూడా వేరే ప్రోగ్రాంలు చేస్తున్నాడు. దీనికి వీ6 యాజమాన్య కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇటీవలి కాలంలో ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తుండటం, ఉదయాభాను లాంటి యాంకర్లతో కలిసి పని చేసే అవకాశంతో సత్తి ఆలోచనా విధానం మారిందని తెలుస్తుంది. ఆయన వ్యవహార శైలి గురించి ప్రశ్నించగా.. మేనేజ్‌మెంట్‌తో గొడవైందని, మరో ఛానె‌ల్‌ రూ. 2 లక్షల జీతం ఇస్తామని ఆఫర్ చేయడంతో సత్తి వీ6కు గుడ్ బై చెప్పాడని తెలుస్తోంది.

తొలుత తీన్మార్ షో రాచ రాములమ్మ, మల్లన్న, తీన్మార్ లచ్చవ్వ లాంటి కొత్త క్యారెక్టర్లతో మొదలైంది. అనతి కాలంలోనే ఈ షో ఎంతో పాపులర్ అయ్యింది. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంతో మల్లన్న ఆ షోకు గుడ్ బై చెప్పాడు. టాలెంటెడ్ యాంకర్ కోసం వీ6 చూస్తున్న సమయంలో మల్లన్నను మరిపించేలా బిత్తిరి సత్తి దూసుకొచ్చాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *