రివ్యూ : అదిరింది మూవీ

కథ

ఇది మెడికల్ మాఫియా చుట్టూ అల్లుకున్న కథ. సిటీలో వరసగా ఒక హాస్పిటల్ చెయిన్ కు సంబంధించిన వాళ్ళు కిడ్నాప్ అవుతుంటారు. ఆ తర్వాత హత్యకు గురవుతారు. అందరికి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుని ఐదు రూపాయలకే సేవ చేసే  డాక్టర్ గా పేరున్న భార్గవ్(విజయ్)మీద అనుమానం వస్తుంది. మరోవైపు మేజిక్ షోలు చేస్తూ ఉండే విజయ్(విజయ్)పాత్ర ఎంటర్ అవుతుంది. స్టేజి మీద అందరు చూస్తుండగానే ఒక హత్య చేసి పారిపోతాడు. అసలు భార్గవ్ కి, విజయ్ కి ఉన్న సంబంధం ఏంటి, ఒక మారుమూల గ్రామంలో విజయ్-భార్గవ్ ల బాల్యంలో హత్య చేయబడ్డ తండ్రి దళపతి(విజయ్)కు కనెక్షన్ ఏంటి  అనేది తెరమీద చూడాల్సిన బాలన్స్. ఈ ముగ్గురి జీవితంతో ఆడుకున్న డాక్టర్ డేనియల్(ఎస్ జె సూర్య)కూడా కథలో కీలక భాగం.

ఎలా తీసారు

కథగా ఇందులో ఎగ్జైట్ చేయడానికి ఏమి లేదు. కాని తన టేకింగ్ తో మాస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగలను అనే నమ్మకంతో ఆట్లీ ఈ కథను తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అతని గత చిత్రం తేరి(తెలుగు పోలీస్) కూడా రెగ్యులర్ పోలీస్ రివెంజ్ డ్రామా మూవీలాగే అనిపిస్తూ ఎంగేజ్ చేయటంలో సక్సెస్ అయ్యింది కాబట్టే తమిళ్ లో  హిట్ అయ్యింది.కాని అలాంటి ఫార్ములాలు మనవాళ్ళు గతంలో చూసారు కాబట్టి ఇక్కడ ఫ్లాప్ అయ్యింది.  దీనికి కూడా అదే  ఫాలో అయ్యాడు కాని ప్రతి సారి అంతే ఇంపాక్ట్ తో కూడిన రిజల్ట్ వస్తుంది అనుకుంటే పొరపాటే. ఇది విజయ్ ఇమేజ్ మాయాజాలంలో ఒక మెసేజ్ ని మిక్స్ చేసి తీసిన రొటీన్ మసాలా మూవీ. కాకపోతే స్టైలిష్ టేకింగ్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాని చాలా హై స్టాండర్డ్స్ లో నిలబెట్టాయి.

ఈ మాత్రం అక్కడ ఆడుతోంది అంటే అదే కారణం అని చెప్పొచ్చు. సినిమా మొదట్లో అంబులన్స్ డ్రైవర్, డాక్టర్, హాస్పిటల్ పిఆర్ఒ కిడ్నాప్ కావడం, ఒక్కొక్కరు హత్యకు గురి కావడం వెంకటేష్ ‘గణేష్’ ని గుర్తుకు తెస్తే, విలన్ పంపిన గూండాలు ఒక హీరోను కొడుతూ ఉంటే డ్యూయల్ రోల్ లో ఉన్న మరో హీరో వచ్చి కాపాడటం ‘విక్రమార్కుడు’ని గుర్తుకు తెస్తుంది. నిత్య మీనన్ హాస్పిటల్ లో జాయిన్ అయినప్పుడు ‘భారతీయుడు’ సినిమాలో కస్తూరి ఎపిసోడ్ గుర్తుకు వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో విజయ్, నిత్య మీనన్ చనిపోయే తరహ సీన్లు ‘విచిత్ర సోదరులు’ లాంటి సినిమాల్లో నుంచి స్ఫూర్తి చెందినట్టు అనిపించింది అని తమిళ రివ్యూయర్లు అన్న మాటతో ఏకీభవించాలి. ఆట్లీ కథాపరంగా కథనంపరంగా ఎక్కడ రిస్క్ చేయలేదు.

ఫాన్స్ ని మాస్ ఆడియన్స్ ని మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు కాబట్టి ఆ యాంగిల్ లో చూస్తే కొత్తదనం ఏమి లేదు. ఆటో డ్రైవర్ కూతురు యాక్సిడెంట్ అయ్యాక హాస్పిటల్ లో జాయిన్ చేయించుకుని నడిపే డ్రామా సీన్లో కొంత ‘టాగూర్’ సినిమాలోని డెడ్ బాడీ ఎపిసోడ్ పోలికలో ఉన్నప్పటికీ నిత్యం ఇది మనకు ఎదురయ్యే అనుభవమే కాబట్టి అక్కడ ఎమోషనల్ కనెక్షన్ వల్ల ప్రేక్షకుడు అలాంటి సీన్లలో లీనమైపోతాడు. ఆట్లీ ఇలాంటి చోట్ల తన తెలివితేటలు, దర్శకత్వ ప్రతిభ బాగా చూపించాడు.  కాని లెంగ్త్ పరంగా అనవసరం అనిపించే సీన్స్ చాలా ఉండటం వల్ల ల్యాగ్ అయిన ఫీలింగ్ చాలా చోట్ల కలుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ మన నేటివిటీకి కాస్త దూరంగా ఉండటమే కాక చిన్న ట్రాక్ ని గంటకు పైగా పెట్టడం కూడా కొంత అసహనానికి గురి చేస్తుంది.

ఎలా చేసారు

ఇది మొత్తంగా వన్ మాన్ షో. విజయ్ మూడు పాత్రల్లో చెలరేగిపోయాడు. గెటప్స్ పరంగా డిఫరెన్స్ ఏమి లేనప్పటికీ యాక్టింగ్ లో చూపించి కవర్ చేసేసాడు. మాస్ ని టార్గెట్ చేసిన సినిమా కాబట్టి పెర్ఫార్మన్స్ పరంగా ల్యాండ్ మార్క్ లాంటి పదాలు వాడలేం. హీరొయిన్లు ముగ్గురు ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ కథను సాగదీయడానికి, బలవంతంగా పాటలు ఇరికించడానికి తప్ప కాజల్, సమంతా చేసింది ఏమి లేదు. ఉన్నంతలో నిత్య మీనన్ నయం. సత్యరాజ్ చేసిన పోలీస్ పాత్ర జస్ట్ ఓకే. విలన్ గా ఎస్ జె సూర్యను చూస్తుంటే ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉండే టాప్ విలన్ గా మారే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

వడివేలు అతి చేయకుండా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. పాటలతో తీవ్రంగా నిరాశ పరిచిన ఎఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. మంచి సౌండ్ సిస్టం ఉన్న థియేటర్ లో చూస్తే దీన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే తేడా కొట్టడం ఖాయం. మెడికల్ మాఫియా, హాస్పిటల్స్ లో ఉండే దారుణమైన పరిస్థితుల చుట్టూ కథను రాసుకున్న విజయేంద్ర ప్రసాద్ కమర్షియల్ సూత్రాలకు లోబడి రాసుకోవడమే ఇది మైల్ స్టోన్ మూవీ కాకుండా ఆపింది. రిస్క్ అయినా పర్వాలేదు అనుకుని ఇంకోలా రాసుకుని ఉంటే భారతీయుడు రేంజ్ వచ్చేది.

ప్లస్ పాయింట్స్

విజయ్ ట్రిపుల్ రోల్స్

మాస్ ఎలెమెంట్స్

రిచ్ మేకింగ్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నెగటివ్ పాయింట్స్

లెంగ్త్

సాంగ్స్

ఫ్లాష్

కొత్తదనం లేకపోవడం

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *