తుస్సుమన్న బాహుబలి2..

బాహుబలి2.. కచ్చితంగా ఇండియాలో అతి పెద్ద హిట్. ఇండియాలో ఈ సినిమా వసూలు చేసినంత మొత్తాన్ని.. ఇప్పట్లో ఏ భారతీయ చిత్రం టచ్ చేయలేదనే మాటలో అవాస్తవం  లేదు. అయితే.. మన ఇండియన్స్ ఉన్న అనేక ప్రదేశాల్లో ఈ సినిమా బాగానే వర్కవుట్ అయింది. నార్త్ అమెరికాలో కూడా కుమ్మేసింది. కానీ ఇతర ప్రాంతాల పరిస్థితి చూస్తే ఆశ్చర్యం వేయకమానదు.

ఐదు వారాల క్రితం జపాన్ లో బాహుబలి2 రిలీజ్ అయింది. ఇప్పుడు ఆరోవారంలోకి ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పటివరకూ వచ్చిన మొత్తం అంతా కలిపి.. దాదాపు అర మిలియన్ యూఎస్ డాలర్లు అంతే. ఈ మాత్రం దానికే జపాన్ లో బాహుబలి2 బంపర్ హిట్ అనేస్తున్నారు నిర్మాత. నిజానికి బాహుబలి2 లాంటి మూవీకి ఇది చాలా చిన్న మొత్తం అనాలి. 2018లో వచ్చిన ఈ అర మిలియన్ కే హిట్ అంటే.. 2 దశాబ్దాలకు పూర్వం వచ్చిన ముత్తు చిత్రం 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మరి బాహుబలి2 ఎలా హిట్ అనాలో మేకర్స్ కే తెలియాలి. ఇండియాలో ఆకట్టుకున్న మాదిరిగా.. ఇతర  ప్రాంతాల్లో బాహుబలి2 ఆకట్టుకోవడం కష్టమే అని అర్ధమవుతోంది.

మరోవైపు.. చైనాలో బాహుబలి2 రిలీజ్ అంటూ బాగానే హంగామా చేశారు కానీ.. ఇప్పుడీ విషయంపై ఏం తేలడం లేదు. గతంలో ఇలాగే బాగా హైప్ చేసి బాహుబలి తొలి భాగం రిలీజ్ చేస్తే.. డిజాస్టర్ గా నిలిచింది. మరి బాహుబలి2ని అసలు రిలీజ్ చేస్తారా లేదా.. చేసినా ఆ స్థాయిలో రిలీజ్ ఉంటుందా అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకట్లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *