వీడియో: 2000 టన్నుల గుడిని 30మీ ముందుకు లాగారు
అది చాలా పురాతనమైన బౌద్ధ టెంపుల్. చైనాలోని షాంగాయ్‌లో ఉంది. చాలా పురాతనమైన, ఫేమస్ టెంపుల్ కావడంతో ఆ టెంపుల్‌ను దర్శించడానికి ప్రతి రోజు దాదాపు లక్ష మంది వస్తుంటారట. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోతుందట. అంతే కాదు.. ఏదైనా జరగరానిది జరిగిదే యాత్రికులను రక్షించడానికి చర్యలు తీసుకునే వీలు లేకుండా ఉందట ఆ టెంపుల్. అత్యంత రద్దీగా ఉండే ఆ టెంపుల్‌ను అన్నింటికీ అనుకూలంగా ఉండటం కోసం ఆ టెంపుల్ ను కొంచెం దూరం కదిలించాలని నిర్ణయించారట.
దీంతో దాన్ని ముందుకు 30 మీటర్లు జరపడం కోసం ప్లాన్ చేశారు. దాని ప్రకారం రెండు వారాల్లోనే మీటరు దూరం జరిపి రికార్డు సృష్టించారు. టెంపుల్ మెయిన హాల్, బౌద్ధ టెంపుల్ ను 30 మీటర్లు రెయిల్స్ ఏర్పాటు చేసి ముందుకు కదిలించారు. 1918 లో ఈ టెంపుల్‌ను నిర్మించారు. ముందుగా టెంపుల్ పునాదిని సిమెంట్‌తో కట్టి రెయిల్స్ ద్వారా అక్కడి నుంచి ముందుకు చేర్చారు. జులై 2014 లో ప్రారంభమైన ఈ పనులు రీసెంట్గా ముగిశాయట. ఇక.. జులై 2014 నుంచి దాన్ని కదిలించడం కోసం చేసిన ఏర్పాట్లు, దాన్ని కదిలించడం కోసం పడ్డ పాట్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నది.