థియేటర్ లో బాలకృష్ణ హల్ చల్

హైదరాబాద్: తన వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదల సందర్భంగా నందమూరి బాలకృష్ణ థియేటర్ లో సందడి చేశారు. కూకట్ పల్లిలోని ‘భ్రమరాంబ’ థియేటర్ లో ఆయన అభిమానులతో కలిసి సినిమా చూశారు. బాలయ్య రాకతో అభిమానులు కెరింతలు కొట్టారు. చిత్ర దర్శకుడు క్రిష్ తోపాటు ప్రముఖ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తదితరులతో కలిసి ఆయన సినిమా చూశారు.

gouthamiputra
gouthamiputra

బెనిఫిట్ షో చూసిన అభిమానులు సినిమా అద్భుతంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక గురువారం ఉదయం ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ లో చిత్ర దర్శకుడు క్రిష్, కథానాయిక శ్రియా సినిమాను ప్రేక్షకులతో కలిసి చూశారు. గొప్ప తెలుగుయోధుడిని జీవితచరిత్రను సినిమాగా మలిచామని,  ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటం థ్రిల్లింగ్ గా ఉందని క్రిష్ అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *