శాతకర్ణి టీంకి బాలయ్య కాక్ టైల్ పార్టీ

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి.. ఈ సంక్రాంతి రేస్ లో నిలిచి.. బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. గతంలో బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన లెజెండ్.. బాలకృష్ణ కెరీర్ లో అతి పెద్ద హిట్. ఇప్పుడు ఆ మూవీ కలెక్షన్స్ ను చాలా పెద్ద మార్జిన్ తో దాటేశారు బాలయ్య.

రిలీజ్ అయిన రెండు వారాల్లో 47 కోట్ల షేర్ వసూలు చేసి.. ఇంకా రికార్డుల దిశగా దూసుకుపోతున్నాడు శాతకర్ణి. ఈ వారాంతంలో పెద్ద సినిమాలు లేకపోవడంతో.. వసూళ్లు ఇంకా కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు యూఎస్ లో ఇప్పటికే 1.6 మిలియన్ డాలర్ల వసూళ్లను అధిగమించింది శాతకర్ణి మూవీ. తాజాగా యూఎస్ టూర్ వెళ్లొచ్చిన బాలయ్య.. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి యూనిట్ కి రేపు ఓ స్టార్ హోటల్ లో కాక్ టైల్ పార్టీ ఇస్తున్నారట.

పెద్దా చిన్నా సంబంధం లేకుండా.. శాతకర్ణి మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరూ ఈ పార్టీకి తప్పనిసరిగా రావాలని చెప్పారట బాలయ్య. ఇక శాతకర్ణితో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించడమే కాదు.. ఇలాంటి రోల్స్ చేయడానికి తానే సమర్ధుడినని ప్రూవ్ చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. ముఖ్యంగా బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ ను బాలయ్య పలికిన తీరును.. అమోఘం అంటున్నారు ప్రేక్షకులు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *