“భక్త రామదాసు” ప్రాజెక్టును జాతికి అంకితం: KCR

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భక్తరామదాసు ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ ఈరోజు జాతికి అంకితం చేయనున్నారు. 11నెలల్లో పూర్తించేసిన ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భక్తరామదాసు ప్రాజెక్టును సీఎం ప్రారంభించిన తర్వాత ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో భారీ బహిరంగసభ నిర్వస్తారు. ఈ బహిరంగ సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలనుంచి భారీగా ప్రజలు తరలిరానున్నారు. ఈ ఏర్పట్లు దగ్గరుండి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పర్యవేక్షిస్తున్నారు.

పదెకరాలకుపైగా స్థలం లో లక్ష మంది కూర్చునేలా విశాలమైన మైదానంలో టెంట్లు వేశారు. సభావేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్, భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 75 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా పాలేరు నియోజకవర్గాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఐజీ, డీఐజీ, కమిషనర్, ముగ్గురు ఏఎస్పీలు, 11మంది డీఎస్పీలు, 37 మంది సీఐలు, 88మం ది ఎస్సైలు, 150మంది ఏఎస్సైలు, 800మంది కానిస్టేబు ల్స్‌సహా రెండు వేలమందితో భారీ భద్రతాచర్యలు చేపట్టారు.

ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత సమీపంలోని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మం డలం అబ్బాయిపాలెం ఎదళ్ల గుట్ట వద్ద మిషన్ భగీరథ పనులను సైతం సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు వద్ద రూ.1,700 కోట్లతో ప్రారంభించిన మిషన్ భగీరథ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్, వరంగల్‌రూరల్ జిల్లాలో కొంత భాగం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొంతభాగానికి నీళ్లు అందనున్నాయి.

ఈ రోజు సీఎం పర్యటన షెడ్యూల్ ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ నుంచి రోడ్డుమార్గంలో సీఎం కేసీఆర్ బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంట్లో అల్పాహారం తీసుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఖమ్మం జిల్లాలోని పాలేరుకు చేరుకొని మిషన్ భగీరథ పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కూసుమంచి మండలం ఎర్రగడ్డతండా వద్ద నిర్మించిన భక్తరామదాసు ప్రాజెక్టును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2:15 గంటలకు తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తండా వద్ద ప్రాజెక్టు నుంచి విడుదయ్యే కృష్ణాజలాలకు పూజ లు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:15 గంటలకు తిరుమలాయపాలెం మండల కేంద్రంలో భారీ బహిరంగసభలో పాల్గొ ని ప్రసంగిస్తారు. తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *