బిగ్ బాస్-3: కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపించిన హిమజ

 

బిగ్ బాస్-3 34వ ఎపిసోడ్ లో శ్రీముఖి కిచెన్ లో గరెటే పట్టుకోవడంతో బాబా భాస్కర్ కి ఖాళీ దొరికింది. బాబా భాస్కర్ తనకి ఇచ్చిన రెండు చపాతీలలో ఒకటి కాకికి వేద్దామని వెళ్తుంటే శ్రీముఖి,శివజ్యోతి అపుతారు. ఆయన దగ్గర ఉన్న ఒక చపాతీ ని శ్రీముఖి తింటుంది దీనితో బాబా సగం తిని సగాన్ని సీక్రెట్ గా కాకికి పెడతారు. ఇక తర్వాత బిగ్ బస్స్ పునార్ణవిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలచి వితికా,వరుణ్, రాహుల్ తన గురించి గుసగుస లాడిన విడియోని చూపిస్తారు. దీనితో పునార్ణవి వితికాపై ఫైర్ అవుతుంది. తర్వాత బిగ్ బాస్ ఈ సారి శ్రీముఖిని సీక్రెట్ రూమ్ లోకి పిలచి తన గురించి రాహుల్,పునార్ణవి,వితికా గుస గుస లాడిన వీడియో చూపిస్తారు. దీనితో శ్రీముఖి బవోద్వేగానికి గురి అయ్యీంది.

ఇక ఈ సారి హిమజని సీక్రెట్ రూమ్ లోకి పిలచిన బిగ్ బాస్ ఆమెను విలన్ గా ఉండమని ఆదేశిస్తారు. హౌస్ లో అందరికీ శాంతి లేకుండా చేయమని, లగ్జరీ బడ్జెట్ ఎవరికీయండకుండా చేయమని చెప్తారు. ఈ సీక్రెట్ టాస్క్ పూర్తి చేస్తే తనకు ఇమ్మునిటీ లభిస్తుందని బంపర్ ఆఫర్ ఇస్తారు బిగ్ బాస్. దీనితో సీక్రెట్ టాస్క్ లో భాగంగా హిమజ ఎవరికి లగ్జరీ బడ్జెట్ అందకుండా ఉండటానికి రంగం లోకి దిగుతుంది. మొదట ఆమ్లెట్ తింటూ బాబా భాస్కర్ ఏదో అనడంతో ఆమె ప్లేట్ ను విసిరి నేలకెసి కొట్టింది. ఇంకా కోపం తగ్గక లోపల ఉన్న గుడ్లను పగలకొట్టి నా ఇష్టం నేను తినలేదు కాబట్టి పగలుగొడతా అంటూ అక్కడ ఉన్నవారికి చుక్కలు చూపించింది. దీనితో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆమెతో వాదనకు దిగారు. దానితో నా ఇష్టం నేను తినలేదు కాబట్టి ఎవరు తినకూడదని ఆషూ,రవి, శివజ్యోతిలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వారి దృష్టిలో విలన్ అయ్యింది. అయితే శ్రీముఖి మాత్రం బిగ్ బాస్ ఏమైనా సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో అని అనుమానం వ్యక్తం చేస్తుంది.

అయితే కానీ లగ్జరీ బడ్జెట్ విషయంలో కంటెస్టెంట్స్ కి అందకుండా చేయడంలో హిమజని రవి, అలీ అడ్డుకున్నారు. దీనితో సీక్రెట్ టాస్క్ లో భాగంగా ఆమెకు ఇచ్చిన ఇమ్యూటినీ కోల్పోయింది హిమజ. తర్వాత రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. మొత్తానికి ఈ వారంలో ఏడుగురు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యి ఉండగా ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *