మామూలుగా కొట్టను: శ్రీముఖి

బిగ్ బాస్-3 ఎపిసోడ్-51 అలీ ఎలిమినేట్ కి కారణమైన బాబా భాస్కర్  ఏడుపుతో మొదలయింది. ఇక అలీ ఎలిమినేట్ అవ్వడంతో ఏడుపు మొదలుపెట్టిన శివజ్యోతి ఈ ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ చేసింది. దీనితో పునర్నవి శివజ్యోతి ని ఓదార్చడం మొదలుపెట్టింది. ఈమెకు తోడు రవి కూడా ఏడుపు మొదలుపెట్టాడు. దీనితో శ్రీముఖి వీళ్ళిద్దరి మీద ఫైర్ అయ్యింది. అలీ ఏమి చనిపోలేదని ఇద్దరు ఏడుపు ఆపకపోతే మామూలుగా కొట్టను అని వార్నింగ్ ఇవ్వడంతో రవి, శివజ్యోతి కంట్రోల్ అయ్యారు.

ఇక ఈ వారం ఎలిమినేషన్ భాగంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 11 మండి కంటెస్టెంట్స్ ని రెండు గ్రూపులుగ విడిపోమన్నారు. బాబా భాస్కర్ ఈ వారం కెప్టెన్ కాబట్టి ఆయనకు మినహాయింపు. మొదటి గ్రూపులో రాహుల్, వితికా, వరుణ్, పునర్నవి, శిల్పా లు ఉండగా, రెండవ గ్రూపులో రవి, శివజ్యోతి, శ్రీముఖి, మహేశ్, హిమజ లీ ఉన్నారు. ఒక గ్రూపులో ఉన్న వారు తమ వ్యతిరేక గ్రూపులో ఉన్నవారిలో ఇద్దరి ఫోటోలు తీసుకొని మంటల్లో కాల్చి నామినేట్ చేయడానికి కారణం చెప్పమని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. దీనితో రవి…రాహుల్, శిల్పా లను, పునర్నవి…మహేష్, శ్రీముఖిలను, శివజ్యోతి…పునర్నవి, శిల్పా, శిల్పా…జ్యోతి, హిమజ, శ్రీముఖి…పునర్నవి, శిల్పా, వితికా…రవి, రాహుల్, హిమజ…శిల్పా, వితికా, వరుణ్…మహేష్, హిమజ, మహేష్…పునర్నవి, వరుణ్, రాహుల్…శ్రీముఖి, రవి.

దీనితో ఈ వారం నామినేషన్స్ లో రవి, మహేష్, పునర్నవి, హిమజ, శ్రీముఖి, శిల్పా ఉన్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ బాబా భాస్కర్ కి ఒక ప్రత్యేక అధికారం ఇచ్చారు. ఎలిమినేషన్స్ కి నామినేట్ అయిన అరుగురిలో ఒకరిని సేవ్ చేయాలని చెప్పారు. దీనితో బాబా భాస్కర్ రవి ని సేవ్ చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *