వైరల్‌గా మారిన బిల్‌గేట్స్ ట్వీట్‌..!

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్..కనీసం ఏడాదికి ఒకసారైనా భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. గతేడాది చివర్లో భారత్‌లో పర్యటించారు బిల్‌గేట్స్. ‘ఏడాదికోసారైనా భారత్‌కు రావాలనుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ఓ కొత్త విషయం నుంచి స్ఫూర్తి పొందుతున్నా’ అంటూ.. తన అనుభవాలను ట్వీట్‌ చేశారు.

అంతేకాకుండా భారత్‌ పర్యటన సందర్భంగా ఇండియాగేట్‌ వద్ద ఆటోలో ప్రయాణించిన ఫొటోను కూడా గేట్స్‌ పోస్టు చేశారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించారు బిల్‌గేట్స్‌. ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్‌ ఎంతగానో స్ఫూర్తినిస్తోందన్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ తొలిసారిగా స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు బిల్‌గెట్స్‌.

bill-gates-praised-pm-modi
bill-gates-praised-pm-modi

మోదీ స్వచ్ఛభారత్‌ గురించి మాట్లాడుతూ.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మహిళలకు కనీస సౌకర్యాలు లేవని, వారు బహిర్భూమికి వెళ్లాలంటే చీకటిపడేవరకు ఆగుతారని, అది వారి ఆరోగ్యానికి ఎంత నష్టం కలిగిస్తుందో తెలుసా? మన తల్లులు, సోదరీమణుల ఆత్మగౌరవాన్ని మనం కాపాడలేమా.. వారికి టాయిలెట్స్‌ కట్టించలేమా?అని మోదీ ప్రశ్నించారని,

మహిళలకు సంబంధించి ఈ సున్నితమైన అంశాన్ని ఓ దేశ నాయకుడు అంత స్పష్టంగా, బహిరంగంగా చెబుతాడని తాను వూహించలేదని, కానీ మోదీ చెప్పగలిగారని బిల్‌ గెట్స్‌ అన్నారు. స్వచ్ఛభారత్‌ గురించి మరో మారు ప్రస్థావిస్తూ.. దేశంలోని ఓ పెద్ద సమస్యను గుర్తించడమేగాక, దాని కోసం అందరూ సమిష్టిగా పనిచేస్తున్నారని గేట్స్‌ కొనియాడారు. ఇదిలా ఉంటే.. తన అనుభవాలను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్న బిల్‌గేట్స్‌ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *