కేసీఆర్ బయోపిక్ లో నటించే హీరో అతడే..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత గాధ ఆధారంగా దర్శకుడు మధుర శ్రీధర్ ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్న విషయం తెలిసిందే. పెళ్లిచూపులు చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన రాజ్ కందుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా ఈ చిత్రం గురించి దర్శకుడు మధుర శ్రీధర్ మరో మరు ప్రస్తవించారు. ఫ్యాషన్ డిజైనర్ – సన్ ఆఫ్ లేడీస్ టైలర్ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన కేసీఆర్ బయో పిక్ గురించి మాట్లాడారు.
కేసీఆర్ చిత్రం లో హీరోగా తాను బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావుని అనుకుంటున్నట్లు తెలిపారు.రాజ్ కుమార్ రావు ముఖంలో కేసీఆర్ పోలికలు ఉంటాయని తెలిపారు. ఈ విషయమై రాజ్ కుమార్ రావుని తాను కలిశానని నటించడానికి ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. తమిళ హీరో విజయ్ ఆంటోని కూడా కేసీఆర్ పాత్రకు సరిపోతారని అన్నారు. ఫ్యాషన్ డిజైనర్ చిత్రం విడుదలయ్యాక ఆవిషయాలన్ని ఆలోచిస్తామని మధుర శ్రీధర్ అన్నారు.