42 ఏళ్ల వయసులో బికినీలో…

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఈ మధ్య సినిమాల స్పీడ్ కాసింత తగ్గించాడు. అయితే కౌంట్ తగ్గినా సక్సెస్ రేషియో మాత్రం బాగానే పెరిగిందని చెప్పాలి. గతేడాది వచ్చిన శివాయ్ చిత్రానికి నెగిటివ్ రేటింగ్స్ వచ్చినా.. మూవీ మాత్రం మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత రెండు సినిమాలను లైన్ లో పెట్టేసిన హీరో.. ఫ్యామిలీ టైంను బాగా మిస్ అయ్యాడనే చెప్పాలి.

అందుకే ఇప్పుడు తన కుటుంబం మొత్తాన్ని తీసుకుని ఎంచక్కా సమ్మర్ టూర్ వేసేశాడు. ప్రస్తుతం అజయ్ దేవగన్ ఫ్యామిలీ అంతా మాల్దీవ్స్ లో ఉండగా.. అక్కడి నుంచి కొన్ని ఫోటోలను ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో అజయ్ వైఫ్.. మాజీ స్టార్ హీరోయిన్ కాజోల్ కూడా ఉంది. 42 ఏళ్ల కాజోల్ బికినీలో ఈ ఫోటోలో దర్శనం ఇవ్వడం విశేషం. కాజోల్ మాత్రమే కాదు.. వీరి కూతురు నైసా కూడా సేమ్ గెటప్ లో ఉంది. మొత్తం ఫ్యామిలీ అంతా స్విమ్మింగ్ డ్రెస్సులో ఇచ్చిన పోజ్ అదిరిపోయిందని చెప్పాలి.

ఏమైనా తన ఫ్యామిలీని ఇలా బికినీల్లో చూపించాలంటే ఏ స్టార్ హీరోకి అయినా బోలెడంత డేరింగ్ ఉండాలి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న అజయ్ దేవగన్.. ఒకవైపు బాద్షాహో మూవీని.. మరోవైపు గోల్ మాల్ ఎగైన్ ను చకచకా ఫినిష్ చేసేస్తున్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *