సంపూర్ణ చంద్రగ్రహణం నేడే:ఈ రాశుల వారిపై ప్రభావం.. ఏం చేయాలి, ఏం చేయకూడదు?

2018లో తొలిసారిగా ఏర్పడుతోన్న చంద్రగ్రహణం సాధారణమైంది కాదని పండితులు అంటున్నారు. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని, దాదాపు 150 ఏళ్ల తర్వాత అరుదైన గ్రహణం ఏర్పడుతోందని ఖగోళ శాస్త్రవేత్తలు కూడా పేర్కొంటున్నారు. జనవరి 31 న బుధవారం నాడు ‘సూపర్ బ్లూ బ్లడ్ మూన్’ ఆకాశంలో కనువిందు చేయనుంది. ఈ అరుదైన గ్రహణాన్ని వీక్షించడానికి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. సూపర్ మూన్ అంటే సాధారణం కన్నా చంద్రుడు మరింత ఇంకా పెద్దదిగా కనిపిస్తాడు. భూ కక్ష్యకు సమీపంలో వచ్చినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. కొద్దిగా నీలం రంగులో ఉండే బ్లూ మూన్ రెండు మూడేళ్లకు ఓసారి దర్శనం ఇస్తుంది. అయితే, పరిమాణంలో పెద్దగా ఉండి, నీలం, ఎరుపు రంగు కలసినట్టు ఉండేదే ‘సూపర్ బ్లడ్ మూన్’. దీన్ని ఖగోళ అద్భుతంగా శాస్త్రవేత్తలు చెబుతారు. 1866లో సూపర్ బ్లడ్ మూన్ వచ్చింది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారిపై ఈ చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మేషం, కర్కాటకం, ధనుస్సు, సింహరాశి వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది

ఈ పనులు చేయకూడదు..

ఇక గ్రహణ పుణ్యకాలంలో చేయకూడనివి. 1. నిద్ర, భోజనం, స్త్రీ సహవాసము కూడవు. 2. గ్రహణానికి ముందు వండిన పదార్థాలు గ్రహణానంతరం తినకూడదు. అయితే, గ్రహణానికి ముందు ఉన్న నూనె పదార్థాలు, గంజి, మజ్జిగ, నూనె/నెయ్యి తో వండిన పదార్థాలపై దర్భతో ఉంచితే అవి తర్వాత వాడుకోవడానికి పనికి వస్తాయి. అలాగే బాల, వృద్ధ, గర్భిణులు మధ్యాహ్నం గం.3-00 వరకు ఆహారం తీసికొనవచ్చును.

గ్రహణ సమయాలు ఇవీ…. సాయంత్రం. 5:18 చంద్రగ్రహణ ప్రారంభ కాలం సా. 6:22 సంపూర్ణ స్థాయిలోకి గ్రహణం రాత్రి. 7:38 గ్రహణం సంపూర్ణ స్థాయి నుండి విడుపు దశ వైపు రాత్రి. 8:41 గ్రహణ అంత్యకాలము ( గ్రహణ మోక్షం ) గ్రహణం ప్రారంభం నుండి వదిలే వరకు ఉన్న మొత్తం గ్రహణ సమయం 3 గంటల 23 నిమిషాలు. సంపూర్ణ సూర్య బింబ దర్షణ కాలం మొత్తం “76”నిమిషాలు.

గ్రహణ నిబంధనలు ఇవీ ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని గర్భిని స్త్రీలు ప్రత్యేక్షంగా చూడ కూడదు,టివిలలో చూస్తే దోషం లేదు. ప్రశాంతగా ఉంటూ మనస్సులో భవంతున్ని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది.గర్భినిలు కదలకుండా పడుకోవాలి అనే అవాస్తవాన్ని నమ్మకండి.ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చును,ఇందులో ఎలాంటి సందేహాలు పడకూడదు.గ్రహణ సమయంలో మల,మూత్ర విసర్జనలు చెయకూడదు అనే అపోహలు వద్దు,అది వాస్తవం కాదు .నిలువ ఉంచే పచ్చల్లు,పిండి వంటలు,ముఖ్యమైన ఎక్కువరోజులు నిలువ ఉంచే ఆహార పదార్ధాలపై గరిక పోసలను వేయాలి.దీనివలన ఆహార పదార్ధాలకు గ్రహణ ప్రభావము పడకుండా కాపాడబడతాయి.

చంద్రుడు మహిళలకు, సూర్యుడు పురుషులకు ఆధిపతులు. చంద్రుడు మనఃకారకుడు. ఆలోచనలకు, బాధలకు, సంతోషాలకు ప్రతిబింబం. కుటుంబాల మధ్య సఖ్యత పెరగాలంటే.. చంద్రగ్రహణ ప్రభావం అధికంగా ఉండే రాశులకు చెందిన వ్యక్తులు పూజలు, శాంతిహోమాల్లో పాల్గోవాలి

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *