మెగాస్టార్ న్యూ లుక్ ఇదేనా..!

ఖైదీ నెంబర్ 150 హిట్ తర్వాత నెక్స్ట్ సినిమాలపై దృష్టి సారించాడు మెగాస్టార్ చిరంజీవి. 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కథతో సినిమా తెరకెక్కనుండగా ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.

ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తుండగా.. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసేసుకున్నారు కూడా. అయితే.. 170 ఏళ్లకు పూర్వం చరిత్రను ఈ సినిమా కోసం ఆవిష్కరించనున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అసలు ఈ మూవీలో మెగాస్టార్ లుక్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది. కచ్చితంగా అప్పటి కాలానికి తగినట్లుగా మెగాస్టార్ రూపం మారాల్సిందే. ఇప్పటికే పలువురు ఆర్టిస్టులతో కలిసి పలు డ్రాయింగ్స్ వేయిస్తున్నారు. మెగాస్టార్ ను ఎలా చూపాలనే విషయం త్వరలోనే ఫైనల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

రీసెంట్‌గా మెగా లుక్ కి సంబంధించిన ఓ పోస్టర్‌.. నెట్ లో వైరల్ గా చక్కర్లు కొడుతోంది. ఈ లుక్ ను ఫైనల్ అని చెప్పలేం కానీ.. ఉయ్యలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి ఈ లుక్ కి మాత్రం మంచి స్పందన వస్తోంది.ఇప్పటి వరకూ చిరు గెటప్ మార్చి చేసిన సినిమాల రిజల్ట్ బాలేదనే విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *