నా పేరు సూర్య హాలీవుడ్ కాపీనా?

వేరే కథలు రెండు మూడు కలిపి వండి కొత్త కథ వార్చడంలో దిట్ట వక్కంతం వంశీ. జెంటిల్ మన్ కథను అటు ఇటు చేసి కిక్ కథ వండేసి, కథకుడై, ఇప్పుడు దర్శకుడు కూడా అయ్యాడు.

ఆ కథ ఎక్కడి నుంచి తెచ్చి వుంటారని వెదుకులాట ప్రారంభమైపొయింది. ఇప్పుడు ఆ వెదుకులాట ఓ కొలిక్కి వచ్చినట్లు ఒక్కసారిగా వార్తలు గుప్పుమంటున్నాయి. 2002లో విడుదలైన హాలీవుడ్ సినిమా Antwone Fisher ఆధారంగా నా పేరు సూర్య కథ అల్లేసినట్లు ఆ వార్తలు వెల్లడిస్తున్నాయి. Finding Fish అనే నవల ఆధారంగా తీసిన సినిమా అది.

కోపాన్ని అణుచుకోలేని కుర్రాడు సైన్యంలో వుంటాడు. అతగాడిని ఓ ఫేమస్ సైక్రియాటిస్ట్ దగ్గరకు వెళ్లి సర్టిఫికెట్ తెచ్చుకోవాలని పంపిస్తారు. ఆ సైక్రియాటిస్ట్ ఎవరో కాదు. హీరో తండ్రే. అయితే అతను సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తాడు. కఠిన పరీక్షలకు గురిచేస్తాడు. తీరా పరీక్షలు అన్నీ అయ్యాక, సర్టిఫికెట్ ఇస్తా అన్నా వద్దు, బోర్డర్ లో కన్నా, ఇక్కడే సమస్యలు ఎక్కువ వున్నాయి అని హీరో వుండిపోతాడు.

ఇదీ నా పేరు సూర్య విషయంలో వినిపిస్తున్న లైన్. ఈ లైన్ దాదాపు ఆ హాలీవుడ్ సినిమా లైన్ కు దగ్గరగా వుంది. అంటే మరి వక్కంతం వంశీ ఈసారి కథను అక్కడి నుంచి లేపేసారని అనుకోవాల్సి వస్తోంది. మన రైటర్లు, డైరక్టర్లు అందరూ ఇదే బాటపడుతున్నారు. చిత్రమేమిటంటే, దర్శకులుగా మారిన రచయితలు కథలు కొట్టేయడం. అంటే దర్శకత్వం చేపట్టాక, రచనకు స్వస్తి చెబుతున్నారనుకోవాలా?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *