అయోధ్యలో కమ్మని భోజనం

రామజన్మ భూమి అయోధ్యలో కొలువైన శ్రీరాముణ్ణి సందర్శించుకునే భక్తులకు ‘రామ్ రసోయి’లో కమ్మని భోజనం లభించనుంది. ‘రామ్ రసోయి’ని మాజీ ఐపీఎస్ అధికారి కిషోర్ కుణాల్ పర్యవేక్షిస్తున్నారు. ఈయన అమావ్ రామమందిరం సేవా ట్రస్ట్ అధ్యక్షునిగా ఉన్నారు. ఈ అమావ్ రామమందిరం రామజన్మభూమికి కొద్ది దూరంలో ఉంది. ఈ ప్రాంతంలోనే ‘రామ్ రసోయి’ ని ఏర్పాటు చేయనున్నారు. దీనిని అతి త్వరలోనే ప్రారంభించనున్నారు. దీనిలో వెయ్యిమంది భక్తులు ఒకేసారి భోజనం చేయవచ్చు. అన్నం, పప్పు, రొట్టె, కూర మొదలైనవి భక్తులకు వడ్డించనున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *