ట్రంప్ ఫస్ట్ ఫారిన్ టూర్ ఫిక్స్

తన మాటలతో.. చేతలతో వివాదాలకు సెంటర్ గా ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ ఫారిన్ టూర్ ఫిక్స్ అయ్యింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఇప్పటివరకూ ఏ విదేశీ పర్యటన చేయలేదు. పదవిని చేపట్టిన తర్వాత.. భారత ప్రధాని మోడీతో ఆయన మాట్లాడిన సందర్భంగా ఇరువురు.. ఒకరినొకరు తమ దేశాలకు రావాలని ఆహ్వానించారు కానీ.. ఇద్దరూ దానిపై ఒక అడుగు ముందుకు వేసింది లేదు. ఇదిలా ఉంటే.. ట్రంప్ ఫస్ట్ ఫారిన్ టూర్ ఎక్కడ ఫిక్స్ అవతుందా?అన్నసందేహాలు తాజాగా తీరిపోయాయి.

ఆయన ఫస్ట్ ఫారిన్ ట్రిప్ ఫిక్స్ అయ్యింది. నాటో దేశాల సదస్సు కోసం ఏప్రిల్ 25న బెల్జియం రాజదాని బ్రస్సెల్స్ లో జరగనుంది. ఈ సదస్సుకు ట్రంప్ హాజరు కానున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన వేళ.. ట్రంప్ నాటోపై వ్యతిరేకత వ్యక్తం చేశారు.నాటో కూటమి కారణంగా అనవసరమైన ఖర్చుగా ఆయన అభివర్ణించారు. మరోవైపు..తాను వ్యతిరేకించిన నాటో కూటమికే ట్రంప్ తన ఫస్ట్ టూర్ పెట్టుకోవటం ఆసక్తికరంగా మారింది.

ఈ సదస్సు అనంతరం ట్రంప్ జీ20 దేశాల సదస్సులో పాల్గొనటం కోసం జర్మనీకి వెళ్లనున్నారు. ఇదే సమావేశానికి భారత ప్రధాని మోడీ కూడా హాజరు కానున్నారు. ఇక్కడే ఇరువురు నేతలు కలవనున్నారు. మరీ.. సందర్బంగా ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *