దొరసాని రివ్యు…

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తనయ శివాత్మిక హీరోయిన్ గా విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా దొరసాని సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ –
30 ఏళ్ల కిందట జరిగిన కథ ఇది. యథార్థ సంఘటనలు తీసుకున్నానని దర్శకుడు కేవియర్ మహేంద్ర ముందే చెప్పారు. అప్పట్లో తెలంగాణ ప్రాంతంలో గడీల రాజ్యం నడిచేది. ఓ ఊరి దొర రాజారెడ్డి (వినయ్‌ వర్మ) కూతురు దొరసాని దేవకి(శివాత్మిక రాజశేఖర్‌)ని పట్టణంలో చదువుకొని వచ్చిన రాజు (ఆనంద్‌ దేవరకొండ) ప్రేమిస్తాడు. దొరసాని కూడా రాజును ప్రేమిస్తూ ఉంటుంది. కానీ వారి ప్రేమకు ఆస్తులు, అంతస్తులు, కులం, అడ్డుగా నిలుస్తాయి. చివరికి వారి ప్రేమకథ ఎలా ముగిసింది ? అనేది కథ.

కథ విశ్లేషణ-
ఒక పేదింటి అబ్బాయి ఒక పెద్దింటి అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ…ఇలాంటి కథలు మన టాలివుడ్ లో ఇప్పటకీ వస్తూనే ఉన్నాయి. అయిన దర్శకుడు కొత్తదనం చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. కొత్త విషయం ఏదైనా ఉందంటే.. అది తెలంగాణ నేపథ్యంగా నడిపించడం. కథను వీలైనంత వాస్తవ పరిస్తితులకు దగ్గరగా తీయాలని దర్శకుడు ప్రయత్నించారు. ఈ చిత్రాన్ని కమర్షియల్ గా తీయకుండా ఓ కళాత్మకంగా తీయడానికి ప్రయత్నించారు.నిదానంగా సాగే ఈ చిత్రం ఎక్కడ బోరు కొట్టించక పోయిన…తరువాత సీన్ ఏంటో తెలిసిపోతుంది. ఓ పేదింటి అబ్బాయి దొరసాని మనసును ఎలా గెలుచుకున్నాడు.. వాటి మధ్య ప్రేమ ఎలా పుట్టిందనే విషయాన్ని చాలా ఆసక్తికరంగా, కవితాత్మకంగా చూపించగలిగారు. ఇప్పటి తెలంగాణలోని మారుమూలు పల్లెలను ఎంచుకుని షూటింగ్‌ చేయడం వల్ల 30 ఏళ్ల నాటి వాతావరణం తెరపై ప్రతిబింబించింది. ఉహించిన క్లైమక్సే అయిన ప్రస్తుత పరిస్తితులకు తగ్గట్టు అనిపిస్తుంది. విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండకు ఇదే తొలి చిత్రం. చాలా బరువైన పాత్రను సమర్థంగా పోషించారు. తొలి చిత్రమే అయినా, ఎక్కడా తడబాటు లేదు. దేవకి పాత్రకు శివాత్మిక వందశాతం న్యాయం చేశారు. సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి తన పాటలతో, బ్యాగ్రౌండ్ స్కోరుతో ఆకట్టుకున్నాడు. కేమెర పనితనం బాగుంది.
dorasani-20190531105002-18430
బలాలు- నటినటులు, సంగీతం
బలహీనతలు- రొటీన్ స్టోరీ, స్లోగా సాగే కథ

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *