హార్దిక్ పాండ్యా డిలీట్ చేసిన ట్వీట్ లో ఏముంది?

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ను భారతీయులు అంత తేలిగ్గా మర్చిపోలేరేమో. గంపెడు ఆశలు పెట్టుకున్న ఈ మ్యాచ్ లో దాయాది చేతిలో దారుణంగా ఓడిపోవటాన్ని ఈజీగా ఏ భారతీయుడు తీసుకోలేని పరిస్థితి. అన్నింటికి మించి ఈ మ్యాచ్లో జరిగిన తప్పులపై సగటు అభిమాని తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నాడు. టాస్ గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకోవటం నుంచి.. మ్యాచ్ ను టర్న్ తిప్పే సత్తా ఉన్నట్లుగా హార్దిక్ పాండ్యా విరుచుకుపడుతున్న వేళ.. అతను రనౌట్ కావటానికి కారణమైన జడేజా తీరును పలువురు తిట్టిపోస్తున్నారు.

ఇలాంటి వేళ.. హార్దిక్ పాండ్యా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే.. తాను పోస్ట్ చేసిన ట్వీట్ ను కొద్దిసేపటి తర్వాత హార్దిక్ పాండ్యా డిలీజ్ చేసినప్పటికీ.. ఒక నెటిజన్ దాన్ని స్క్రీన్ షాట్ తీయటం.. అది కాస్తా వైరల్ గా మారటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

కప్పు చేజారిన రోజు రాత్రి పోస్ట్ చేసిన ఈ ట్వీట్ లో సారాంశాన్ని చూస్తే.. మమ్మల్ని మేం మోసం చేసుకుంటున్నాం.. ప్రత్యర్థి జట్టుకు అంత సామర్థ్యం లేదంటూ చేసిన ట్వీట్ పై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. హార్దిక్ పాండ్యా ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్ చేశారన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నగా మారింది.  మాంచి ఊపు మీద ఉన్న పాండ్యా రనౌట్ కాకుండా జడేజా తన వికెట్ ను త్యాగం చేస్తే.. బాగుండేదని..కానీ ఆ పని చేయకుండా ఉండటంపై పాండ్యా  అలాంటి ట్వీట్ చేశారా? అన్నది ప్రశ్నగా మారింది. ఏమైనా.. పాండ్యా డిలీట్ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *