మళ్ళీ చెల్లని కరెన్సీ…మోడి ప్రభుత్వం పట్టించుకొనేనా…

నవంబరు 8, 2016 నుంచి రూ.500, రూ,1000 నోట్లాను మార్పిడి(రద్దు) చేసే నిర్ణయం మోడి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం పాతా రూ.500 మరియు రూ.1000 ను రద్దు చేసీ వాటికి బదులుగా కొత్త వాటిని వాడుకలోకి తెచ్చింది. అంతకు ముందు వరకు వాడిన పాత నోట్లు 1996 లో నుంచి వాడకంలోకి వచ్చాయి. కాని నోట్ల రద్దు తర్వత క్రమేప కొన్ని నోట్లు చలమణీ అవ్వడం లేదు.5rs 10rs

విషయానికి వస్తే మనం నిత్యం వాడకునే కరెన్సీలో ఈ మధ్య ముఖ్యంగా రూ.5 నోటు, రూ.10 బిళ్ళ చలమణీలో లేవని ఒక దుమారం లేచింది. దీనివల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నరు. ఎక్కడ వీటిని వాడీన అవి చెల్లడం లేదని ఆంటున్నరు. ఆటో డ్రైవర్లు, చిల్లర కొట్టుల్లో, కూరగాయల మార్కెట్లలో ఎక్కడ వీటిని ఇచ్చిన అవి వడుకంలో లేవని తిరిగి వెనక్కి ఇస్తున్నారు. దీనికి గల కారణం పెద్ద పెద్ద దుఖాణాల్లొ వాటిని తీసుకోకపోవడం. దేశంలో అక్కడక్కడ ఇవి వాడుకలో వున్న చాలా చోట్లా వీటిని తీసుకోవడం లేదు.

భారత రిజర్వ్ బ్యాంక్ మొట్టమొదటి సారిగ ప్రవేశపెట్టిన పేపర్ నోటు రూ.5 దీనిని జనవరి 1938లో ప్రవేశపెట్టరు. ఇది పూర్తిగా వడుకలో లేకుండ పోయింది. భారత ప్రభుత్వం రూ.10 నాణేన్ని 2005 లో ప్రవేశపెట్టింది. అప్పటి నుండి చలమణిలో ఉన్నఈ బిల్ల వాడుకలో లేదునే సమచారం ఇప్పటికే చాలాసార్లు చక్కర్లు కొట్టింది. కాని భారత రిజర్వ్ బ్యాంక్ మాత్రం ఇవి చలమణీలోనే ఉన్నాయని చెబుతుంది. ఇప్పటికే అర్ బిఐ వాడుకొవచ్చని ద్రువీకరించిన ఇవి మాత్రం ప్రజల్లోకి వెళ్ళడం లేదు. ఇప్పటికైనా మోడి ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టిచ్చుకొని వాటిని వాడుకలోకి తెస్తుందని అశిద్దాం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *