ఐపీఎల్ (IPL 2021) మ్యాచ్ 31 బెంగళూరు కోల్కతా మ్యాచ్ ప్రివ్యూ

IPL 2021 Match 31 RCB vs KKR Preview, Prediction and Final Playing11:
ఐపీల్ 2021 సీజన్లో 31 వ మ్యాచ్ బెంగళూరు (RCB ) కోల్కత (KKR )తో సోమవారం సెప్టెంబర్ 20 న అబుదాబి లోని షైక్ జాయేద్ స్టేడియం లో రాత్రి 7:30 గంటలకు జరగనున్నది. విరాట్ కోహ్లీ ఈ సీజన్లో తరువాత RCB క్యాప్టియన్ గా తప్పుకుంటానని ప్రకటించాడు. ఈ ప్రకటన బెంగళూరు అభిమానులను బాధపెట్టేదే కానీ, తాను ఐపీల్ ఆడినన్ని రోజులు RCB కె ఆడుతాను అని విరాట్ కోహ్లీ తెలిపాడు.

ఇక ఈ రెండు జట్లు ఈ సీజన్లో ఆడిన మ్యాచ్ లో RCB గెలిచింది. ఇక ఆడిన 7 మ్యాచ్ లలో 5 మ్యాచ్ లు గెలిచి 10 పాయింట్లతో RCB పాయింట్స్ టేబుల్ లో 3 వ స్థానంలో ఉండగా, కేవలం 2 మ్యాచ్ లు మాత్రమే గెలిచి KKR 7 వ స్థానంలో ఉంది. ఇక వీరిద్దరి ముఖాముఖీ జరిగిన 27 మ్యాచ్ లలో 14 మ్యాచ్ లు KKR గెలువగా, RCB 13 గెలిచింది.

ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఫైనల్ ప్లేయింగ్ 11 ఎవరంటే:
విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, రజత్ పటిదార్, మాక్స్వెల్, అబ్ డీ విల్లియర్స్, సబద్ అహ్మద్, వినుండు హాసరంగా, ఖేల్ జేమిసన్ , హర్షల్ పటేల్, మోహ్హమద్ సిరాజ్, యుజువేంద్ర చాహల్.

ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్ ప్లేయింగ్ 11 ఎవరంటే:
రాహుల్ త్రిపాఠి , శుబ్మన్ గిల్, ఇయన్ మోర్గాన్, సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, దినేష్ కార్తీక్, , శివమ్ మావి/నగర్ కోటి, లోకి ఫర్గుసన్ / టీమ్ సోతి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ .

అబుదాబి పిచ్:
ఈ పిచ్ పేస్ బౌలర్ లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచినవాళ్లు ఫీల్డింగ్ చేయడానికి మొగ్గు చూపుతారు. ఇక్కడ చేస్ చేసిన టీం గెలిచే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ బాటింగ్ సరాసరి స్కోర్ 160 నుంచి 170 పరుగులు.

చూడాలి మరి, మరో విజయం కాయం చేసుకొని RCB టాప్ 4 టీం లలో ఉండిపోతుందా, లేక అనూహ్యంగా KKR పుంజుకొని సీజన్లో తన అవకాశాలను పదిలం చేసుకుంటుందా. మీకేమనిపిస్తుందో కామెంట్ చెయ్యండి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *